CM REVANTH REDDY : వారికి సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్! హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను వదిలి వెళ్లాలని, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు. By V.J Reddy 11 Sep 2024 | నవీకరించబడింది పై 11 Sep 2024 15:23 IST in హైదరాబాద్ రాజకీయాలు New Update షేర్ చేయండి CM Revanth Reddy: హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించిన వారిని చెరబడతాం అని హెచ్చరించారు. ఎంతటి గొప్పవారైనా వదిలిపెట్టం అని అన్నారు. అవసరమైతే చెరసాలకు పంపిస్తాం అని చెప్పారు. అంతేగాని హైడ్రాపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అక్రమ విల్లాలు, ఫాంహౌస్‌ల నిర్మాణాలను నేలమట్టం చేయడమే హైడ్రా లక్యం అని పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణలను విడిచిపెట్టి వెళ్ళండి.. గొప్పవాళ్ళైనా వదలక తప్పదు..లేకపోతే ఉన్నపళంగా నేలమట్టం చేస్తాం…… @revanth_anumula pic.twitter.com/9A0Xyqgp5Y — Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) September 11, 2024 ఇవాళ కాకపోతే రేపైనా కూలుస్తాం అని అన్నారు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన చెరువులు, కుంటలను ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను వదిలివెళ్లండంటూ ఫైర్ అయ్యారు. Also Read : సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ హైడ్రాకు మరో కీలక బాధ్యతలు.. క్రమ కట్టడాల భరతం పడుతున్న హైడ్రాకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలోనూ హైడ్రాకు భాగస్వామ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా కార్యాచరణను మొదలు పెట్టింది. చెరువులు, నాలాల సమీపంలోని భవనాలకు హైడ్రా అధికారుల అనుమతులు తప్పనిసరి కానున్నట్లు ప్రభుత్వ యంత్రంగాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. #congress #revanth-reddy #hydra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి