Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్‌ను అందజేశారు By V.J Reddy 11 Sep 2024 | నవీకరించబడింది పై 11 Sep 2024 10:48 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ తో సమావేశం అయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్‌ను అందజేశారు పవన్. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ ను పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి రూ .కోటి చెక్ ను అందజేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయి.. ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రూ.4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించనున్నానని అధికారికంగా ప్రకటించారు. రేవంత్ నిర్ణయానికి పవన్ సై… ఇటీవల తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన హైడ్రా పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదారాబాద్ లో జరుగుతున్న హైడ్రా అనేది కరెక్ట్, కాకపోతే అసలు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నించారు. పూర్తిగా కట్టేసిన తరవాత కూల్చడం వలన సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఇక్కడ ఎలా పరీవాహక ప్రాంతాలు పరిరక్షించుకోవాలి అనేదానిపై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. తెలంగాణలో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకువస్తే మంచిదే.. కానీ అలా చేస్తే ఇక్కడ చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. Also Read : తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు #pawan-kalyan #telangana #revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి