దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల స్ట్రైక్.. డిమాండ్స్‌ ఇవే !

దేశవ్యాప్తంగా ఈరోజు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు సమ్మే చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ స్ట్రైక్‌ కొనసాగనుంది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ప్రయాణ ఛార్జీలు అమలు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

New Update
Ola, Uber And Rapido Drivers On Strike Today

Ola, Uber And Rapido Drivers On Strike Today

దేశవ్యాప్తంగా ఈరోజు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు సమ్మే చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ స్ట్రైక్‌ కొనసాగనుంది. 6 గంటల పాటు ఈ స్ట్రైక్ కొనసాగనుంది. యాప్‌లను ఆఫ్‌ చేసిన డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన  కనీస ప్రయాణ ఛార్జీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పలు నగరాల్లో అయితే క్యాబ్‌ సర్వీసులను పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Also Read: ఆ చర్చలు ఫెయిల్ అయితే ఇరాన్‌పై దాడులు చేస్తాం.. అమెరికా సంచలన వార్నింగ్

యాప్‌ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. కంపెనీలే ఎక్కువ కమీషన్లు వసూలు చేస్తున్నాయని.. దీనివల్ల తమ ఆదాయం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ప్రయాణ ఛార్జీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలతో కమర్షియల్ రైడ్స్ నిషేధించాలని కోరుతున్నారు. ఫేర్ విధానం పారదర్శకంగా ఉండాలని అంటున్నారు. డిస్కౌంట్‌లతో డ్రైవర్లపై భారం తగ్గించాలంటున్నారు. ఇప్పటికే భారత్‌ టాక్సీ పేరుతో కేంద్రం టాక్సీ సేవలు ప్రారంభించిందని.. ఇది పూర్తిగా అమల్లోకి వస్తే తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు నేరవేర్చకుంటే తీవ్రంగా ఉద్యమాలు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. 

Also Read: గ్రామ సర్పంచ్ కీలక నిర్ణయం.. మద్యం లేకుండా పెళ్లి జరిపితే రూ.51 వేల నజరానా

Advertisment
తాజా కథనాలు