/rtv/media/media_files/2025/06/16/OGX5CTIruBPgykDTt35s.jpg)
VIRAL VIDEO Rapido
VIRAL VIDEO: బెంగళూరులో జయనగర్ ప్రాంతంలో రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఓమహిళా ప్రయాణికుడిపై దాడి చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. ఓ మహిళ స్థానిక ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. ఆమె బైక్ నుంచి దిగి, డ్రైవర్‌ను అతడి ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రశ్నించడంతో వాగ్వాదం ప్రారంభమైంది. అయితే.. వారిద్దరి మధ్య భాషా సమస్య తలెత్తింది. మహిళ ఇంగ్లీష్‌లో మాట్లాడగా, డ్రైవర్ మాత్రం కన్నడలో మాత్రమే సమాధానం ఇచ్చాడు. ఇది వారిద్దరి మధ్య మనస్పర్థను మరింత తీవ్రతరం చేసింది.
ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రశ్నించడంతో..
ఘటన సమయంలో.. ఆ మహిళ ఛార్జీ చెల్లించడాన్ని, హెల్మెట్‌ను తిరిగి ఇవ్వడాన్ని నిరాకరించింది. దీంతో విసిగిపోయిన డ్రైవర్ ఆమెపై చెంపదెబ్బ కొట్టాడు. ఆమె నేలపై పడిపోవడాన్ని వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. వీరిద్దరూ వాగ్వాదం పడుతుంటే.. పక్కనే ఉన్న వారు జోక్యం చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించినా, ఎవరూ చొరవ తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేదు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సూచించారు. అనంతరం నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
BENGALURU: Rapido bike rider slaps customer as she allegedly questions him over rash driving and jumping signal. Incident occurred on June 14th in Jayanagar area of Bengaluru.
— Rahul Shivshankar (@RShivshankar) June 16, 2025
Jayanagar police are looking into the case.
INPUT: @Harishup pic.twitter.com/j8IbpvItT0
ఈ సంఘటన నేపథ్యంలో బైక్ టాక్సీల చట్టబద్ధతపై మరోసారి చర్చ మొదలైంది. ఏప్రిల్‌లో కర్ణాటక హైకోర్టు బైక్ టాక్సీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఈ సేవలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. రాష్ట్ర రవాణా మంత్రి రామలింగ రెడ్డి ప్రకారం.. కోర్టు అప్పట్లో ఆగ్రిగేటర్లకు 6 వారాల గడువు ఇచ్చింది. వారి కోరిక మేరకు మరో 6 వారాలు ఇచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఆదేశాలను పాటించలేదని విమర్శించారు. దీంతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీల సేవలు పూర్తిగా నిలిపి వేయబడే అవకాశముంది. ఈ సేవలపై నిషేధం విధిస్తే..1.5 లక్షల గిగ్ కార్మికుల ఉపాధిపై దెబ్బ పడే ప్రమాదం ఉంది. బైక్ టాక్సీ మార్కెట్‌లో రాపిడో 60% వాటా కలిగి ఉండగా, రోజుకు సగటున 16.5 లక్షల రైడ్‌లు నిర్వహిస్తోంది. దేశంలో టెక్ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు వంటి నగరాల్లో ఈ సేవలు వాడకంలో ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్నాయి.
ఇది కూడా చదవండి: తెలంగాణలో బీఆర్ఎస్ నేత కిడ్నాప్ కలకలం
( Viral Video | rapido | Latest News | telugu-news)
ఇది కూడా చదవండి: ఇంట్లో కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి? భలే టెస్టీగా ఇలా చేసుకోండి