Bike Taxi Ban: ఊబర్, ఓలా, ర్యాపిడో బైక్‌లు బ్యాన్.. హైకోర్టు సంచలన తీర్పు!

బైక్ టాక్సీల వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రానున్న 6 వారాల్లో వీటిని నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సరైన నిబంధనలు లేకుండా ఈ సేవలను కొనసాగించొద్దని, వీటికి సరైన చట్టం అవసరమని జస్టిస్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. 

New Update
karnata rapido

Karnataka High Court sensational verdict on bike taxi controversy

Bike Taxi Ban: బైక్ టాక్సీల వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రానున్న 6 వారాల్లో వీటిని నిలిపివేయాలని, ప్రభుత్వం నుంచి సరైన నిబంధనలు లేకుండా ఈ సేవలను కొనసాగించొద్దని స్పష్టం చేసింది. సరైన చట్టం అవసరమని జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు.కర్ణాటకలో కర్ణాటక ప్రభుత్వానికి బైక్ టాక్సీ సేవలను మోటార్ వాహనాల చట్టం  1988 కింద చేర్చటానికి మూడు వారాల గడువును అందిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

సరైన చట్టబద్ధత అవసరం..

ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో, బైక్ టాక్సీ సేవలను అందిస్తున్న వ్యక్తులపై దాడులు పెరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తెల్ల నంబర్ ప్లేట్లు కలిగిన టూవీలర్స్ వాణిజ్యపరంగా వినియోగానికి అనుమతి లేదని, బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగేటర్ల సేవలను  వ్యతిరేకించింది. దీనికి విచారించిన కోర్టు సరైన చట్టబద్ధత అవసరమని తెలిపింది. టూవీలర్లకు రవాణా వాహనాలుగా గుర్తించటం లేదా వాటికి కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిషన్లు ఇచ్చేలా తాము రవాణా శాఖను ఆదేశించలేమని తెలిపింది. తమ ఆదేశాలను పాటించి, కార్యకలాపాలను నిలిపివేయాలని పిటిషనర్లను ఆదేశించింది.

ఇది కూడా చదవండి: విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు

అలాగే ట్రాఫిక్, భద్రతపై బైక్ టాక్సీల ప్రభావాన్ని అంచనా వేసిన 2019 నిపుణుల కమిటీ నివేదికను ఈ సందర్భంగా కోర్టు ఉదహరించింది. ఈ సేవలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించే ముందు నియంత్రణ స్పష్టత అవసరమని నొక్కి చెప్పింది. 

ఇది కూడా చదవండి: సోడా తాగడం వల్ల నిజంగా గ్యాస్ నయమవుతుందా?

high-court | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు