Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న స్టీల్ రెయిలింగ్‌ను ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల బాబు మృతి చెందగా తల్లికి తీవ్రగాయలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే కనుమూయడంతో ఆ తల్లిదండ్రుల శోకం అందరినీ కలిచివేసింది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఏపీ కడపలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లిమర్రి కొత్తూరు వద్ద వేగంగా వెళ్తున్న కంటైనర్ బైక్ ను ఢీ కొట్టింది. ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మృతులు వేంపల్లికి చెందినమల్లికార్జున, బాలయ్య, మల్లికార్జునగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు టూరిస్టులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దక్షిణ కొరియాకు చెందిన పర్యాటకులు గాయపడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల దగ్గర ఆగి ఉన్న లారీని బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందగా.. 25మందికి గాయాలయ్యాయి. తమిళనాడు బస్సు హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కాకినాడ కల్పనా సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వైఎస్సాఆర్ ఫ్లైఓవర్ నుంచి కల్పనా సెంటర్ మీదుగా వస్తున్న కారు..బైక్ ను అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఇద్దరు మృతి చెందగా...ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.