Mahabubnagar: లారీ, బస్సు మధ్యలో కారు..స్పాట్‌లోనే 25మంది!

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల దగ్గర ఆగి ఉన్న లారీని బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందగా.. 25మందికి గాయాలయ్యాయి. తమిళనాడు బస్సు హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

New Update

Mahabubnagar: మమహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల 44జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపుగా వెళ్తున్న తమిళనాడు బస్సు అతి వేగంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ తో పాటు బస్సులోని ఓ ప్రయాణికుడు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని మహబూబ్ నగర్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన ప్రయాణికుడిని కర్నూల్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్‌.. అమెరికాలో ఏం జరుగుతోంది?

సిద్దిపేటలో మరో ఘోర ప్రమాదం

ఇది ఇలా ఉంటే.. సిద్దిపేటలో మరో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సిద్దిపేట్ కలెక్టరేట్ వద్ద బైకుపై వెళ్తున్న దంపతులపైకి లారీ దూసుకెళ్లింది. సిద్ధిపేట జిల్లా కొహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు ఎరవెళ్లి బాలకిష్టయ్య, రేణుక పనిమీద సిద్ధిపేటకు వెళ్లారు. అయితే పని ముగించుకుని తిరుగు ప్రయాణమై వస్తుండగా కలెక్టరేట్ దగ్గర మూల ములపులో వెనకనుండి వేగంగా వచ్చిన లారీ దంపతులు ప్రయాణిస్తున్న బైకును ఢీ కొట్టింది. ఈ క్రమంలో బాలక్రష్టయ్యపైకి లారీ ఎక్కడంతో అక్కడిక్కడే మరణించగా..  రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, పోలీసులు బాధితుల బంధువులకు సమాచారం అందించారు. డెడ్ బాడిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే లారీని పట్టుకొని  కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Also Read: Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఆవేదన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు