/rtv/media/media_files/2025/04/29/1bsS6yCsKRZMc8Gncn9T.jpg)
Road accident in Bhadrachalam
Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు టూరిస్టులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , వినోభనగర్ వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దక్షిణ కొరియాకు చెందిన పర్యాటకులు గాయపడ్డారు.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
రెండు కార్లలో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిలో హైదరాబాద్ వెళ్తున్న కుటుంబం, భద్రాచలం దర్శనానికి వెళ్తున్న సౌత్ కొరియా టూరిస్టులు ఉన్నారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జు అయ్యాయి.
ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణం అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?