/rtv/media/media_files/2025/07/05/road-accident-2025-07-05-11-47-48.jpg)
Road Accident:
Road accident : ఏపీలోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున రేణిగుంట నారాయణ కాలేజీ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఉద్యోగులతో వెళ్తున్న అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది. వేకువ జామున జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగిని(25) మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి.
ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను రేణిగుంట అర్బన్ డిఎస్పి శ్రీనివాసరావు స్థానికులను, ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
Also Read: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లో వందేభారత్‌కు మరో 4 కోచ్‌లు