/rtv/media/media_files/2025/06/11/PxVn2f4d6yl5SDpsl5NI.jpg)
Husband commits suicide
TG Crime: భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణం తీసింది. భార్య వివాహేతర సంబంధం తనకు అవమానంగా భావించిన భర్త ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో చోటు చేసుకుంది. తడగొండకు చెందిన హరీశ్ కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో పెళ్లి జరిగింది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.
Also Read: Covid : భయపెడుతున్న కరోనా భూతం..ప్రధాని కేబినెట్ మీటింగ్ హాజరుకూ పరీక్షలు తప్పనిసరి
హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. దీంతో కావేరి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం హరీశ్ కుటుంబ సభ్యులు అతనికి తెలియజేయగా ఈ విషయమై కావేరికి ఫోన్ చేసిన హరీశ్ ఆమెను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
Also Read : ఆ కామాంధుడు ట్రంప్‌పై 34 కేసులు.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఇదే!!
భార్య విషయం తెలిసిన హరీశ్ ఈ నెల 8న దుబాయి నుండి తడకొండకు వచ్చాడు. తన భార్యతో గొడవపడ్డాడు. అయితే కావేరి మాత్రం "నువ్వు నాకు వద్దు చచ్చిపో.. నేను రక్షణ్ తోను ఉంటా'నని తేల్చి చెప్పింది. దీంతో మనస్తాపం చెంది బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన హరీశ్ ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు బావినుంచి శవాన్ని వెలికితీశారు. హరీశ్ తల్లి ఫిర్యాదు మేరకు కావేరి, రక్షణ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: USA-India: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
Follow Us