/rtv/media/media_files/2025/08/29/rajanna-siricilla-floods-incident-2025-08-29-11-21-06.jpg)
rajanna Siricilla floods incident
Floods: "అయ్యా.. మీ కాళ్ళు మొక్కుతాను నా కొడుకును ఎలాగైనా కాపాడండయ్యా.. అంటూ తల్లి అధికారులను వేడుకుంటున్న దృశ్యం వేలాది మంది హృదయాలను కదిలించింది. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన తన కొడుకు కోసం తల్లి పడుతున్న వేదన ఇది. 30 గంటల నుంచి ఎదురుచూస్తున్నా తన కొడుకు ఇంకా రాలేదు. హెలికాప్టర్ ద్వారా చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి! వివరాల్లోకి వెళితే.. వరద ప్రభావంతో సిరిసిల్లా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన లక్ష్మీ అనే మహిళ కుమారుడు జంగం స్వామి వరదల్లో చిక్కుకుపోయాడు. దీంతో తన కొడుకును కాపాడండి అంటూ లక్ష్మీ పడుతున్న ఆవేదన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. జంగ స్వామితో పాటు అప్పర్ మానేరు వద్ద చిక్కుకున్న మరో ఐదుగురిని కాపాడేందుకు అధికారులు హెలికాఫ్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
Anguish of mother Lakshmi waiting for her son trapped in #floodwaters#Telangana#Sircilla: "Please save my son. It’s been 30 hours" Repeated chopper attempts failed due to adverse weather; Finally JangamSwamy returned to tears of welcome, thanked rescuers for giving him 2nd life pic.twitter.com/5EdkSuzpdm
— Uma Sudhir (@umasudhir) August 28, 2025
ఆవేశంగా మారిన ఆవేదన
దీంతో 30 గంటలుగా తన కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లి లక్ష్మీ ఆవేదన ఆవేశంగా మారింది. నా కొడుకును కాపాడలేనప్పుడు ఈ ఎన్నికలు, నాయకులు దేనికి? నన్ను మాట్లాడకుండా ఆపడానికి ప్రయత్నిచకండి. మళ్ళీ ప్రయత్నించి నా కొడుకును కాపాడండి అంటూ అధికారులను గట్టిగా అడిగింది. చివరికి ఆమె ఎదురుచూపులకు తెర పడింది. IAF హెలికాప్టర్ ద్వారా జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో జంగం స్వామి సురక్షితంగా బయటపడ్డాడు. అతడిని చూడగానే తల్లి, కుటుంబ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం జంగం స్వామి రెస్క్యూ టీమ్ కి కృతజ్ఞతలు తెలిపాడు. "నాకు రెండో జీవితాన్ని ఇచ్చారు" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
మెదక్ లో మరో ఘటన..
మెదక్ జిల్లాల్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. సోషల్ మీడియాలో బాగా పేరు పొందిన "నైట్స్ ఇన్ ఫ్లోరోసెంట్ ఆరెంజ్" అనే రెస్క్యూ టీమ్ ఈ మహిళను ఎంతో జాగ్రత్తగా ఆస్పత్రికి చేర్చారు. సకాలంలో NDRF టీమ్ కూడా స్పందించడంతో తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇలాంటి సమయాల్లో రెస్క్యూ టీమ్స్ పాత్ర ఎంత ముఖ్యమైనదో మరో సారి రుజువైంది.
ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా కామారెడ్డి, మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతం అయ్యాయి. వరద నీటి ప్రవాహంతో వాగులు, వంకలు ఉప్పొంగడంతో రోడ్లు, వంతెనలు ధ్వంసం అయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. కామారెడ్డిలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. GRకాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు నీట మునిగాయి. ఛాతి లోతున వరద నీరు చేరడంతో చాలా మంది వరదల్లో చిక్కుకుపోయారు. వరద బాధితుల కోసం పోలీసులు అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు.