/rtv/media/media_files/2025/08/28/minor-girl-commits-suicide-2025-08-28-18-42-33.jpg)
Minor girl commits suicide
SIRICILLA : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారం చేశారు. న్యూడ్ వీడియోలు,ఫోటోలు తీసి వాటిని అమ్మాయికి పంపించి బెదిరించి పలుమార్లు అత్యాచారం జరిపారు. దీంతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. నా చావుకు కారణం అయిన ముగ్గురు మృగాలను తక్షణమే శిక్షించాలని కోరుతూ ఆ అమ్మాయి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ బాలిక అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడిందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె రాసిన ఆత్మహత్య లేఖ అసలు విషయం వెలుగు చూసింది.
Also Read : వరదల్లో చిక్కుకున్న హీరో మాధవన్.. వైరల్ అవుతున్న వీడియో!
మైనర్ బాలికను కత్తులతో బెదిరించి..లైంగిక దాడి చేసి..వీడియోలు చిత్రీకరించి ముగ్గురు మానవ మృగాలు వేధించినట్లు అమ్మాయి లేఖలో పేర్కొంది. తమ కూతురు అనారోగ్యంతో మరణించిందని బాధపడిన తల్లిదండ్రులకు లేఖ దొరకడంతో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. వారి కూతురు రాసుకున్న సూసైడ్ నోట్ దొరకడంతో, ఆమె ఫోనులో ఉన్న వీడియోలు, ఫోటోలు వెతికి చూసి షాక్ అయ్యారు ఇంట్లో ఎవరు లేని సమయంలో గాలిపల్లి గ్రామానికి వినోద్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కత్తులతో బెదిరిస్తూ, లైంగిక దాడి చేసి, వీడియోలు చిత్రీకరించారని బాలిక తండ్రి ఆరోపించారు.
Also Read: హైదరాబాద్‌లో మరికాసేపట్లో భారీ వర్షం..ఎవరు బయటకు రావొద్దు..IMD హెచ్చరిక
యువకుల వేధింపులపై బాలిక చివరి లేఖ రాసింది. వారిని వదిలిపెట్టవద్దని లేఖలో వేడుకుంది. తన పరువు మొత్తం పోయిందని వాపోయింది. వారితో శారీరకంగా గడపకపోతే నన్ను మా నాన్నను చంపుతామని బెదిరించారని లేఖలో బాలిక స్పష్టం చేసింది. తమ కుటుంబాన్ని కూరగాయలు అమ్ముకోకుండా చేశారని బాధపడింది. ఎవరికైనా చెబితే వీడియోలు బయటకు వదులుతామని 2 సంవత్సరాలుగా నిందితులు బాలికను చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించి మైనర్ బాలిక మరణించింది. -- తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకులపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురు మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితి ఘోరం VIDEO.. ఈరోజు మరో 2 జిల్లాల్లో డేంజర్