/rtv/media/media_files/2025/11/12/fotojet-76-2025-11-12-18-58-51.jpg)
The Rajanna temple is closed
Vemulawada : దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ద శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో మొక్కులు బందయ్యాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ తెల్లవారుజాము నుంచి దర్శనాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయంగా వేములవాడకు వచ్చే భక్తులను భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేశామన్నారు.
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ద శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనుల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి దర్శనాలను నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా వేములవాడకు వచ్చే భక్తులను భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. pic.twitter.com/LtAX2xUAJw
— AIR News Hyderabad (@airnews_hyd) November 12, 2025
దక్షిణ కాశీ వేముల వాడ రాజన్న స్వామి వారి దేవస్థానంలో ఇవాళ వేకువజాము నుంచి భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో.. భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయం ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు. కాగా ఆలయం చుట్టూ పలు ప్రాంతాలలో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనుప రేకులు అమర్చిన సంగతి తెలిసిందే. ఇక భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్ పైన రాజన్నను దర్శించుకుని, భీమేశ్వర ఆలయంలో మొక్కలు చెల్లించాలని అధికారులు తెలుపుతున్నారు.
భీమేశ్వరాలయంలో భక్తుల దర్శనాలతో పాటు కోడె మొక్కలు ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుంచి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దక్షిణం, ఉత్తర భాగాలలో ఉన్న ప్రాకారం.. పడమర వైపు ఉన్న నైవేద్యశాల, ఆలయ ఈవో కార్యాలయం ఇప్పటికే కూల్చివేశారు. ఈ క్రమంలో తాజాగా ఇవాళ తెల్లవారుజామున మెయిన్ గేట్‌ను సైతం ఇనుప రేకులతో మూసివేశారు.
ఇది కూడా చూడండి: Crime News: ఏపీలో కిడ్నీ రాకెట్.. ప్రాణం తీసిన దందా... రూ.8 లక్షలతో గుట్టు రట్టు!
Follow Us