/rtv/media/media_files/2025/08/23/indiramma-sarees-2025-08-23-18-57-22.jpg)
Indiramma sarees
Indiramma sarees : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేసే యోచనలో పడింది. ఈ క్రమంలో వచ్చే బతుకమ్మ పండుగకు మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇది అందరూ మహిళలకు మాత్రం కాదు. మహిళా పొదుపు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. ఇందిరమ్మ చీరల పేరుతో పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి రెండు చీరలు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే చీరల ఉత్పత్తిని వేగవంతం చేసింది. ఈ చీరలకోసం సిరిసిల్ల నేత కార్మికులకు సర్కార్ ఆర్డర్ ఇచ్చింది.ఇక్కడ సుమారు 65 లక్షల చీరల తయారీకి ఆర్డర్ ఇచ్చింది. నేత కొరకు ఇప్పటికే రెండు విడతల్లో 9 కోట్ల మీటర్ల వస్త్రాన్ని నేత కార్మికులకు అందించింది.
ఇది కూడా చూడండి:Kukatpalli Murder Case: వాడిని చంపేయండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న కూకట్‌పల్లి బాలిక తండ్రి ఆవేదన!
గత ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగకు మహిళలకు బతుకమ్మ చీరల పేరుతో ఒక్కో చీర అందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరలు నిలిపివేసింది. అయితే ఈ విషయంలో కొంత విమర్శలు సైతం వచ్చాయి. ఈ క్రమంలో ‘ఇందిరా మహిళా శక్తి’ స్కీమ్ లో భాగంగా మహిళా పొదుపు సంఘాలకు చీరలు ఇస్తామని ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే పలు చీరలను కూడా పరిశీలించారు. ఇక సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులకు ఏడాదంతా ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ చీరల ఉత్పత్తిని వారికే అప్పగించింది. నిజానికి గత ఫిబ్రవరిలోనే చీరలు తయారు చేసేందుకు ఆర్డర్ ఇవ్వడంతో పాటు రూ.316 కోట్లు కూడా కేటాయించింది. అయితే చీరలు ఉత్పత్తి చేసే కార్మికులకు వేతనాలు ఖరారు కాకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ తర్వాత జరిగిన ఒప్పందంతో వేతనాలపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో ఇందిరమ్మ చీరల ఉత్పత్తి లో వేగం పెంచింది. ఇందిరమ్మ చీరల నేతతో సిరిసిల్లాలో 6 వేల మంది కార్మికులు ఉపాధి లభించింది..వారికి నెలకు దాదాపు రూ.20 వేల వరకు లభిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : AP Mega DSC Results: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి!
మహిళా సంఘాలకు అందించే చీరల నేత వేగం అందుకోవడంతో ఇప్పటికే దాదాపు 30 లక్షల చీరలు ఉత్పత్తి అయ్యాయి. మరో 30 లక్షల చీరలను బతుకమ్మ పండుగ నాటికి ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో కార్మికులు మూడు షిప్టుల్లో పని చేస్తున్నారు. మరోవైపు గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలకు భిన్నంగా వీటిని నాణ్యతతో తయారు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో చీర దాదాపు రూ.800 వరకు ధర పలుకుతుందని అధికారులు చెప్తున్నారు. వీటిని రాష్ట్రంలోని మహిళా పొదుపు సంఘాల సభ్యులకు బతుకమ్మ నాటికి అందిస్తామని వారు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి:Kukatpally Murder Case: క్రికెట్ కిట్ కోసమే దొంగతనం చేసిన విద్యార్థి.. కూకట్‌పల్లి మర్డర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు