రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ఆ కేసులో పుణె కోర్టు సమన్లు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.
బీజేపీ బహుజన వ్యతిరేకి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా కూడా రిజర్వేషన్లు కాపాడుకుంటామని పేర్కొన్నారు. కుల గణన పేరు చెప్పేందుకే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీన చేస్తామని కోర్టు తెలిపింది. 2018లో కర్ణాటక ఎన్నికల సమయంలో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది.
రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. సిక్కుల మనోభావాలు దెబ్బ తీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేతలు మూడు FIRలు దాఖలు చేశారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని ఆయన తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
రాహుల్ గాంధీ ఉగ్రవాది అంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దేశంలో నెం.1 టెర్రరిస్టు రాహుల్ గాంధీ అంటూ బిట్టు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.
సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా కూడా ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. మంచి మిత్రుడిని కోల్పోయానని రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు.
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని అక్కడి మీడియా పాక్-భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని అడగగా..పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని,దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని తెలిపారు. మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం అంగీకరించబోమన్నారు.