Rahul Gandhi: పాక్-బంగ్లా పై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు!

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీని అక్కడి మీడియా పాక్‌-భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని అడగగా..పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని,దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని తెలిపారు. మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం అంగీకరించబోమన్నారు.

author-image
By Bhavana
New Update
 పాక్-బంగ్లా పై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు!

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వాషింగ్టన్‌లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ గాంధీని పాకిస్తాన్, భారతదేశం మధ్య సంబంధాల గురించి అక్కడి వారు ఒక ప్రశ్న అడిగారు. పాక్‌తో భారత్‌ సంబంధాలు ఎలా ఉన్నాయి, కశ్మీర్‌ సమస్య కారణంగా ఇరు దేశాలు కలిసి రాలేకపోతున్నాయా? అంటూ ప్రశ్నించారు. 

ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయబోం..

ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ, కాదు, అలా కాదు, పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని తెలిపారు. పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం అంగీకరించబోమన్నారు. ఆ దేశం దీనిని కొనసాగించినంత కాలం రెండు దేశాల మధ్య సంబంధాల మధ్య సమస్యలు ఉంటాయని తెలిపారు.

ఆ సంబంధాలు ఇప్పటి కావు..

బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు ఇప్పటి కావు.. ఎప్పటి నుంచో కొనసాగుతున్నవే. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందూ సమాజానికి చెందిన వ్యక్తులపై అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయని, కొంతమంది ఇళ్లకు నిప్పు పెట్టారని, ఇళ్లను తగులబెట్టారని రాహుల్‌ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లోని తీవ్రవాద అంశాల గురించి భారతదేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని నేను ఒప్పుకుంటున్నాను. అయితే, బంగ్లాలో పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని.. ప్రస్తుత ప్రభుత్వంతో లేదా మరేదైనా ప్రభుత్వంతో మేము బలమైన సంబంధాలను కొనసాగించగలమని నమ్ముతున్నాం. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో తీవ్ర అలజడి నెలకొన్న సంగతి తెలిసిందే.

దేశంలో తిరుగుబాటు కూడా జరిగింది. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మహ్మద్ యూనస్ నేతృత్వంలో దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.

Also Read: ఉధృత గోదావరి.. 50 అడుగులు దాటి నిలకడగా వరద!

Advertisment
తాజా కథనాలు