Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై ఛత్తీస్‌గఢ్‌లో 3 ఎఫ్‌ఐఆర్‌లు

రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. సిక్కుల మనోభావాలు దెబ్బ తీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేతలు మూడు FIRలు దాఖలు చేశారు.

New Update
RAHUL GANDHI

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ నెల 9న అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. పర్యటనలో భాగంగా సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆయనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, దుర్గ్‌ జిల్లాల్లో బీజేపీ నేతలు ఈ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. 

రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని భారత న్యాయ సంహిత సెక్షన్‌ 299, సెక్షన్‌ 302ల ప్రకారం పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. ఇదిలా ఉంటే రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాహుల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

రిజర్వేషన్లు రద్దు అంటూ...

ఇటీవల అమెరికాలో పర్యటించారు రాహుల్ గాంధీ. ఈ పర్యటనలో భాగంగా జార్జ్‌టౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించారు. అయితే.. భారత్ అభివృద్ధి, రిజర్వేషన్లపై విద్యార్థులు రాహుల్ గాంధీని అడగగా.. ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు రావడంకోసం రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. రిజర్వేషన్ల వల్ల కొందరికి లాభం చేకూరగా.. మరికొంత మందికి నష్టం చేకూరుస్తుందని అన్నారు. కాగా లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి అదిఆకారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై మాట్లాడడంపై బీజేపీ విమర్శల దాడికి దిగింది.

పాస్ పోర్ట్ రద్దు చేయండి...

రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నశిస్తుంది కానీ రిజర్వేషన్ నశించదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ పిల్లతనం వదిలేయాలని హితవు పలికారు. దేశం బయటకు వెళ్లి దేశాన్ని విమర్శించడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం రిజర్వేషన్‌ను అంతం చేయదు ఎందుకంటే ఆయన ప్రభుత్వం రాదు అని చురకలు అంటించారు.

Advertisment
తాజా కథనాలు