Rahul Gandhi: రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీన చేస్తామని కోర్టు తెలిపింది. 2018లో కర్ణాటక ఎన్నికల సమయంలో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది.

author-image
By V.J Reddy
New Update
RAHUL GANDHI


Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీన జరుపుతామని కోర్టు పేర్కొంది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా నాటి బీజేపీ  జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షా పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

ఈ నేపథ్యంలో బీజేపీతో పాటు అమిత్ షా (Amit Shah) ను కించపరిచేలా రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ యూపీలోని సుల్తాన్‌పుర్‌ కు చెందిన బీజేపీ నేత విజయ్‌మిశ్ర స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు లో పరువు నష్టం దావా వేశారు. కాగా ఈ కేసు విచారణ అప్పటి నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా  ఈ కేసుపై శనివారం విచారణ జరగాల్సి ఉండగా.. స్థానిక బార్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో వైద్యశిబిరం నిర్వహించిన కారణంగా అక్టోబరు 1కి వాయిదా పడింది. తదుపరి వాయిదాలోనైనా ఈ కేసు ఓకే ముగింపు వస్తుందో లేదో చూడాలి.

Also Read :  రాహుల్‌ గాంధీపై ఛత్తీస్‌గఢ్‌లో 3 ఎఫ్‌ఐఆర్‌లు

ఇటీవల మూడు FIRలు..

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ నెల 9న అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. పర్యటనలో భాగంగా సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆయనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, దుర్గ్‌ జిల్లాల్లో బీజేపీ నేతలు ఈ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. 

రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని భారత న్యాయ సంహిత సెక్షన్‌ 299, సెక్షన్‌ 302ల ప్రకారం పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. ఇదిలా ఉంటే రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాహుల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

Also Read :  తిరుపతి లడ్డూ వివాదం పై తీవ్రంగా స్పందించిన రాహుల్‌ !

Advertisment
తాజా కథనాలు