Rahul Gandhi: తిరుపతి లడ్డూ వివాదం పై తీవ్రంగా స్పందించిన రాహుల్ ! తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని ఆయన తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. By Bhavana 21 Sep 2024 in నేషనల్ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి Tirumala Laddu: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ విషయంలో గత రెండు రోజులుగా వివాదం చెలరేగుతోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వాడారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా తిరుమల లడ్డూ కల్తీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగానూ కోట్లాది మంది భక్తులు పూజిస్తారు. తిరుపతిలో ప్రసాదాల కల్తీ అంశం ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. కల్తీ విషయం గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలంటూ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. Also Read: జానీ మాస్టర్ వైఫ్ అయేషా సంచలన నిర్ణయం #rahul-gandhi #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి