/rtv/media/media_files/2026/02/15/rahul-gandhi-2026-02-15-20-10-15.jpg)
Rahul Gandhi intensifies attack on Centre over US trade deal
Rahul Gandhi: అమెరికాతో ట్రెడ్ డీల్ అంశంపై విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందం పేరుతో భారతీయ రైతులు మోసపోవడాన్ని చూస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ సార్వభౌమత్వాన్ని రాజీపడేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఒప్పందం కేవలం తాత్కాలిక విషయం కాదని.. రైతుల భవిష్యత్తుకు సంబంధించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read: వాలెంటైన్స్ డే రోజున ప్రియుడితో భార్య.. భర్త చేసిన పనికి అందరూ షాక్
'' డీడీజీ (డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్) దిగుమతి అంటే ? జన్యుమార్పిడి చేసిన అమెరికన్ మొక్కజొన్న నుంచి తయారుచేసిన దాణాను మన దేశ పశువులకు తినిపించండం కాదా ?. భారత పాల ఉత్పత్తి అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడేలా చేయదా ? జన్యుమార్పిడి జరిగిన సోయాబీన్ ఆయిల్‌కు పర్మిషన్ ఇస్తే దేశంలోని సోయాబీన్ రైతులపై ప్రభావం పడదా ?.
Also Read: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. ఇండియా ప్రధాని మోదీకి ఆహ్వానం
మీరు చెప్పిన అదనపు ఉత్పత్తులు అంటే దీని అర్థం ఏంటి ?. రాబోయే రోజుల్లో క్రమంగా పప్పుధాన్యాలతో పాటు ఇతర అమెరికన్ పంటల దిగుమతులకు తలుపులు తెరవడమేనా?. వాణిజ్యేతర అడ్డంకులను తొలగించడం అంటే ? జన్యుమార్పిడి పంటలపై విధానాలు మార్చడం, ధాన్యం సేకరణను తగ్గించడం, కనీస మద్దతు ధర లేదా బోనస్‌లను తగ్గించే అంశంలో భారత్ ఒత్తిడిని ఎదుర్కోనుందా ? ప్రతి ఒప్పందంలో మరిన్ని పంటలను ఈ లిస్టులో చేరుస్తారా ? అంటూ'' రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. ఇది తాత్కాలిక విషయం కాదని.. రైతుల భవిష్యత్తుకు సంబంధించిందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంపై మరో దేశం పట్టు సాధించేలా పర్మిషన్ ఇస్తున్నామా ? అంటూ అసహనం వ్యక్తం చేశారు.
US trade deal के नाम पर हम भारत के किसानों के साथ विश्वासघात होते हुए देख रहे हैं।
— Rahul Gandhi (@RahulGandhi) February 15, 2026
मैं प्रधानमंत्री से कुछ आसान सवाल पूछना चाहता हूं:
1. DDG import करने का वास्तव में क्या मतलब है? क्या इसका मतलब यह है कि भारतीय मवेशियों को GM अमेरिकी मक्का से बने distillers grain खिलाए जाएंगे?…
Follow Us