Rahul Gandhi: నేడు వికారాబాద్ కు రానున్న రాహుల్ గాంధీ

విపక్ష నేత రాహుల్‌గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. వికారాబాద్‌ సమీపంలోని అనంతరిగిరి హిల్స్‌లో 9 రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

విపక్ష నేత రాహుల్‌గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. వికారాబాద్‌ సమీపంలోని అనంతరిగిరి హిల్స్‌లో 9 రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు రాహుల్‌ గాంధీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. 

Also Read: తెలంగాణలో నడుస్తోంది ప్రజాపాలన కాదు..బుల్డోజర్‌ పాలన..కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ వెళ్తారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేలా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలపై రాహుల్‌ గాంధీ డీసీసీ అధ్యక్షులకు వివరించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రమే ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు