/rtv/media/media_files/2026/01/08/india-2026-01-08-17-21-32.jpg)
గత పదేళ్లుగా అధికారంలో ఉన్న గుజరాత్ బీజేపీ ఎంపీల ఆస్తులు(Gujarat BJP MPs assets) ఊహించని రీతిలో పెరిగాయని ADR(adr-report), నేషనల్ ఎలక్షన్ వాచ్ తమ తాజా విశ్లేషణలో వెల్లడించాయి. 2014 నుండి 2024 వరకు వరుసగా మూడు సార్లు ఎన్నికైన ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేశారు. ADR నివేదిక ప్రకారం, గుజరాత్ నుండి వరుసగా మూడుసార్లు (2014, 2019, 2024) ఎన్నికైన ఎంపీల ఆస్తుల పెరుగుదల షాకింగ్‌గా ఉంది. ఈ ఎంపీల సగటు ఆస్తులు పదేళ్ల కాలంలో 110 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఈ నివేదిక ప్రస్తుతం గుజరాత్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
గత పదేండ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(pm modi) ఆస్తులు కూడా దాదాపు 80 శాతం పెరిగిందట.
2014లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ప్రధాని తన ఆస్తుల విలువ రూ.1.65 కోట్లుగా ప్రకటించారు. అయితే, ఈ పదేండ్లలో మోదీ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. దాదాపు 80 శాతం వృద్ధి కనిపించింది. ప్రస్తుతం ప్రధాని ఆస్తుల విలువ రూ.3,02,06889కు చేరింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆస్తుల్లో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో రాహుల్ ఆస్తుల విలువ రూ.9.4 కోట్లుగా ఉంది. 2024 నాటికి అది రూ.20.39 కోట్లకు పెరిగింది. ఈ పదేండ్ల కాలంలో ఆయన సంపద దాదాపు 117 శాతం వృద్ధి చెందింది.
गुजरात के जामनगर से भाजपा सांसद पुनमबेन माडम की संपत्ति 2014 में 17 करोड़ से बढ़कर 2024 में 147 करोड़ हो गई। #ADRREPORT#ADR#MPWealth#Politics#PoliticiansWealth#MPAssets#IndianPoliticianspic.twitter.com/Kzt3cwjsjb
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) January 7, 2026
Also Read : India Census : జనగణన తొలిదశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..నోటిఫికేషన్ జారీ
జామ్‌నగర్ ఎంపీ పూనంబెన్ మేడమ్:
ఈ జాబితాలో పూనంబెన్ మేడమ్ అగ్రస్థానంలో ఉన్నారు. 2014లో ఆమె ప్రకటించిన ఆస్తి విలువ దాదాపు రూ.17 కోట్లు కాగా, 2024 నాటికి అది రూ.147 కోట్లకు చేరింది. అంటే పదేళ్లలోనే ఆమె సంపద 747 శాతం (దాదాపు రూ.130 కోట్లు) పెరిగింది.
కచ్ ఎంపీ వినోద్ లఖంషి చావడా: 2014లో కేవలం రూ.56 లక్షల ఆస్తులను ప్రకటించిన వినోద్ చావడా, 2024 నాటికి తన ఆస్తి రూ.6.5 కోట్లుగా పేర్కొన్నారు. ఇది ఏకంగా 1,100 శాతం వృద్ధిని సూచిస్తోంది.
బార్డోలి ఎంపీ ప్రభుభాయ్ నాగర్‌భాయ్ వాసవ : ఈయన ఆస్తులు రూ.1.6 కోట్ల నుండి రూ.4.7 కోట్లకు పెరిగాయి. అయితే, అందరి ఎంపీల ఆస్తులు పెరగలేదని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి, నవసారి ఎంపీ సి.ఆర్. పాటిల్ ఆస్తులలో తగ్గుదల కనిపించింది. 2014తో పోలిస్తే ఆయన ప్రకటించిన ఆస్తుల విలువలో 47 శాతం కోత పడింది. ఈ నివేదికపై స్పందించిన రాజకీయ విశ్లేషకులు, ప్రజాప్రతినిధుల ఆదాయ వనరులపై పారదర్శకత ఉండాలని కోరుతున్నారు. ఒకవైపు సామాన్య ప్రజల ఆదాయాలు నామమాత్రంగా పెరుగుతుంటే, ప్రజాప్రతినిధుల సంపద మాత్రం వందల రెట్లు పెరగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ధన బలం పెరగడం వల్ల సామాన్యులు పోటీ చేసే అవకాశం తగ్గిపోతోందని ADR ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : Stock Market Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి
Follow Us