/rtv/media/media_files/2026/02/03/rahul-2026-02-03-15-49-51.jpg)
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు, డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితోనే ఈ ఒప్పందంపై మోదీ సంతకం చేశారని ఆరోపించారు. మోదీ రాజీపడ్డారని.. ప్రధాని దేశాన్ని అమ్మేశారంటూ రాహుల్ కామెంట్స్ చేశారు. పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఈ డీల్‌పై మోదీ ఈ సంతకం చేశారని ఆరోపించారు.
"మోదీ చాలా కంగారు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆగిపోయిన వాణిజ్య ఒప్పందంపై నిన్న రాత్రి ఆయన హడావిడిగా సంతకం చేశారు. దీని వెనుక విపరీతమైన ఒత్తిడి ఉంది. తన ఇమేజ్ ఎక్కడ పాడైపోతుందో అని మోదీ భయపడుతున్నారు" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మన దేశ ప్రజల కష్టాన్ని ఈ ఒప్పందం ద్వారా మోదీ విదేశాలకు అమ్మేశారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ చైనా అంశాన్ని, మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకానికి సంబంధించిన అంశాలను లేవనెత్తారు. అయితే, నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంటూ స్పీకర్ ఆయనను మాట్లాడనివ్వలేదు. దీనిపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "చరిత్రలో మొదటిసారిగా ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వడం లేదు. ఎందుకంటే ప్రధాని నిజం బయటపడుతుందని భయపడుతున్నారు" అని అన్నారు.
రాహుల్ సంచలన ఆరోపణలు
ఎప్స్టీన్ ఫైల్స్ పై రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలో అదానీపై ఉన్న కేసు నిజానికి మోదీపై ఉన్న కేసేనని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉన్న కొన్ని అంశాల వల్ల అమెరికా నుండి మోదీపై ఒత్తిడి వస్తోందని, అందుకే ఆయన దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఎప్స్టీన్ ఫైల్స్ అంశాన్ని భారత విదేశాంగ శాఖ (MEA) ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. 2017లో ప్రధాని మోదీ అధికారికంగా ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన మాట నిజమే కానీ, ఆ ఫైల్స్‌లో వస్తున్న ఇతర ఆరోపణలన్నీ ఆధార రహితం, నీచమైనవి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం ప్రధాని ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రలని కొట్టిపారేసింది.
Follow Us