/rtv/media/media_files/2025/09/16/group-1-rankers-family-press-meet-2025-09-16-13-12-55.jpg)
Group -1 Rankers Family Press Meet
Group -1 Rankers’ Parents : తెలంగాణ గ్రూపు 1 పరీక్షల వివాదం ముదురుతోంది. ఇటీవల గ్రూప్ - 1 ఫలితాలను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆన్సర్ షీట్స్‌ను మళ్లీ మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశించింది.లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లే యోచనలో TGPSC ఉంది. మరోవైపు తమ జీవితాలను ఆగం చేయొద్దంటూ ఎంపికైన అభ్యర్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీపై రాజకీయాలు ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. ఇదిలా ఉండగానే గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడారు.
గ్రూప్-1 పోస్టులు ఒక్కొక్కటి రూ.3 కోట్లకు అమ్ముకున్నారని పలువురు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పేరెంట్స్ మాట్లాడారు. “గ్రూప్-1 పోస్టును రూ. 3 కోట్లుకు కొన్నారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. మూడు కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా మాకు తెలియదన్నారు. మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది. ఏదో వ్యాపారం చేసుకుని బతికేవాళ్లం కదా అన్నారు. మేమందరం మూడు కోట్ల లంచం ఇచ్చే పరిస్థితిలో ఉన్నామా..? ఒక్కసారి మమ్మల్ని చూసి ఆలోచించండి అని ఆవేదన వ్యక్తం చేశారు. మా పిల్లలకు న్యాయం చేయండి. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని హైకోర్టును కూడా విన్నవించుకుంటున్నాం.” అని ఆవేదన వ్యక్తం చేశారు. మాలో చాలామంది ఒక్కపూట తింటే మరోపూట తినలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. అలాంటిది కోట్లు పెట్టి సీట్లు ఎలా కొంటాం అని వారు ప్రశ్నించారు.
గ్రూప్ 1 ఫలితాలపై ఎవరకి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. ఒక్కో పేరెంట్ 3 కోట్ల రూపాయలు పెట్టి పోస్ట్ లు కొన్నారంటున్నారు. మాలో కొందరికి కూటికి కూడా గతి లేదు.. కష్టపడి.. పస్తులుండి.. అప్పులు చేసి పిల్లలను చదివించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం వల్ల సమాజం మా పట్ల చిన్న చూపు చూసే అవకాశం ఉందని తెలిపారు... ఆరోపణలు తిప్పికొట్టకపోతే నిజంగానే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతామనే మీడియా ముందుకు వచ్చామన్నారు. రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా.. 3 కోట్లు పెట్టి కొనుక్కున్న ఉద్యోగం అని నలుగురూ అనుకునే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు... మీ రాజకీయాలు మీ మధ్యే ఉంచుకోండి.. మీ ఆరోపణలు, ప్రత్యారోపణలు.. నిరుద్యోగులపై రుద్దకండి అని వేడుకున్నారు. దుష్ప్రచారం చేసి.. నిరుద్యోగులను చిన్నచూపు చూసే ఆరోపణలు చేయకండని కోరారు. మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించండి.. వాస్తవాలను బయటపెట్టండి.. రాజకీయాలు చేసి.. మా పిల్లల జీవితాలు నాశనం చేయకండి..” అని మరో పేరెంట్ వాపోయారు. రాజకీయ నాయుకులు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరే గెలుస్తారు. అలా అని ఓడిపోయిన నేతలంతా మళ్లీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్తారా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు.
ఇప్పటికే పిల్లలు చాలా కష్టపడ్డారని మళ్లీ పరీక్షలు రాయాలంటే ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుందని వారు వాపోయారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. మళ్లీ మెయిన్స్ పెట్టినా ఆ ఫలితాలు కూడా రద్దు కావని గ్యారెంటీ ఏంటి? వారు ప్రశ్నించారు. ర్యాంకులు తెచ్చుకుని కూడా మా పిల్లలు రోడ్డున పడ్డట్లైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఆరోపణలతో మా పిల్లలు తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 ర్యాంకర్లను ప్రభుత్వం ఆదుకోవాలని మీ రాజకీయల కోసం మా పిల్లల భవిష్యత్ నాశం చేసి నోటికాడి ముద్దు ఎత్తగొట్టవద్దని వారు కోరారు.
ఇది కూడా చూడండి:Income Tax Returns : ఐటీఆర్ దాఖలు చేయలేదా? త్వరపడండి..ఈ రోజే చివరి అవకాశం!