/rtv/media/media_files/2026/02/10/fotojet-2026-02-10-16-13-35.jpg)
Young blood is entering politics...heirs are coming
AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(andhra-pradesh-politics) నెమ్మదిగా పాత నాయకులు తప్పుకొని తమ వారసుల ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తున్నారు. కొందరు తాము పూర్తిగా సైడ్ అయిపోయి తమ సీట్లను వారసులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. మరికొందరు తాము పవర్ లో ఉండగానే తమ వాళ్లను రాజకీయాల్లో నిలదొక్కుకునేలా స్కెచ్ గీస్తున్నారు. వారసత్వం కేవలం ఇంటి పేరుకే పరిమితం కాదు.... అది ఇప్పుడు ప్రజా సేవకు పట్టుగొమ్మగా మారుతోంది. ఏపీ రాజకీయాల్లో(AP Political News) 'వారసుల' హవా మొదలైంది. రాజకీయం అంటే ఇప్పుడు కేవలం ఒకరి తర్వాత ఒకరు వచ్చే సీటు మార్పిడి కాదు.. అది తండ్రుల ఇమేజ్‌ను కాపాడుకుంటూనే తమ సొంత ముద్ర వేయాల్సిన అగ్నిపరీక్ష. రాజకీయ కురువృద్ధుల అడుగుజాడల్లో.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూసుకొస్తున్నారు వారసులు. ఒకప్పుడు తండ్రులు గర్జించిన గడ్డపై ఇప్పుడు కొడుకులు, కూతుళ్లు సింహనాదం చేయబోతున్నారు. ఇంటి పేరు అండగా, ప్రజాభిమానం అస్త్రంగా ఏపీ రాజకీయ క్షేత్రంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతున్నారు. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన హేమాహేమీల వారసులు ఇప్పుడు నేరుగా ప్రజా క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు.
ఇక ఉత్తరాంధ్రలో ఏ కుటుంబం నుంచి వారసులు రాజకీయరంగంలో అడుగుపెడుతున్నారో చూద్దాం. టీడీపీ, వైసీపీ అనే తేడా లేకుండా దిగ్గజ నేతలంతా తమ వారసులను వచ్చే ఎన్నికల బరిలోకి దింపేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాయకులు వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజను రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేని అవంతి శ్రీనివాసరావు ఇప్పటికే తన కుమార్తెను కార్పొరేటర్ గా బరిలోకి దింపారు. వైసీపీకి దూరమైన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ వాదిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చక్రం తిప్పిన ద్రోణంరాజు సత్యనారాయణ మనవడు ద్రోణంరాజు శ్రీవాత్సవను విశాఖ సౌత్ నుంచి నిలబెట్టారని ద్రోణంరాజు శ్రీనివాస్ ఫ్యామిలీ భావిస్తోంది. శ్రీవాత్సవను వైసీపీ నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.
గాజువాక నుంచి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై విజయం సాధించిన తిప్పల నాగిరెడ్డి తనయులు దేవన్ రెడ్డి, వంశీకృష్ణ లను రాజకీయ వారసులుగా ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. వి మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తన కుమారుడు అప్పలనాయుడిని బరిలోకి దింపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. గతంలో పెందుర్తి తాను ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీకి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు.. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయండి.. సీఎం చంద్రబాబు
/filters:format(webp)/rtv/media/media_files/2026/02/10/fotojet-2-2026-02-10-16-15-01.jpg)
Young Blood Is Entering Politics
ఎలమంచిలి లో దాదాపు మూడు సార్లు విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు తన తనయుడు సుకుమార్ రాజును ఎన్నికల్లో బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు . పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు వైసీపీ తరఫున తన కొడుకును పాయకరావుపేట నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడి తనయుడు చింతకాయల విజయపాత్రుడు అనకాపల్లి ఎంపీ లేదా నర్సీపట్నం ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశం ఉంది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకురానున్నారు. మాజీ మంత్రి బొత్స కుటుంబం తమ వారసులుగా కొడుకు సందీప్, కూతురు అనూషను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఇప్పటికే తన కుమార్తె సిరిని రాజకీయాల్లోకి దింపారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా తన కుమారుడిని అరకు ఎంపీ లేదా పాడేరు ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని గత ఎన్నికల్లో ప్రయత్నించారు. అయితే అతనికి కూడా టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సీరియస్ గా ప్రయత్నించే అవకాశాలున్నాయని ఆయన వర్గీయులు చెబుతున్నారు. - political-party
ఉమ్మడి విజయనగరం జిల్లాలో పరిస్థితిని చూస్తే మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కూతురు కోలగట్ల శ్రావణి రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కొడుకులు మణి దీప్, ప్రదీప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గజపతినగరం నియోజకవర్గం నుంచి బొత్స అప్పలనర్సయ్య కొడుకు సాయి గురి నాయుడు రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు తమ్ముడు శంబంగి వేణు నాయుడు పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. - ap politics news
ఇక కోస్తాంధ్ర నుంచి ప్రధాన పార్టీల నుంచి వారసులు వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొడుకు జ్యోతుల నవీన్ కుమార్ ప్రస్తుతం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పెద్దాపురం నుంచి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొడుకు నిమ్మకాయల రంగ నాగ్ రాజకీయాల్లోకి వస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) తనయుడు వనమాడి మోహన్ రాజకీయాల్లోకి రానున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ రాజకీయాల్లోకి ప్రవేశం చేయనున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోదరుడి కుమారుడు గోరంట్ల రవి రామ్ కిరణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసే ఛాన్స్ ఉంది.
Also Read : ఆమెకు 37 అతనికి 17 ఇద్దరి మధ్య ఎఫైర్.. భర్త, అత్తను లేపేందుకు స్కెచ్.. చివరకు ఏం జరిగిందంటే..?
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కొడుకు పులపర్తి ప్రశాంత్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ నియోజకవర్గంలో పనులను చక్కబెడుతున్నారు. తణుకు నుంచి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉండి నుంచి టిడిపి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు కుమారుడు కనుమూరి భరత్ రాజకీయాల్లోకి రానున్నారు. ఆచంట నుంచి టిడిపి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ బరిలోకి దిగనున్నారు.ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం కిమిడి కళా వెంకట్రావు కొడుకు కిమిడి రామ్ మల్లిక్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన కొడుకు నిఖిల్ ను రాజకీయాల్లో కీలకంగా తీసుకువస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో శ్రీనివాస్ తనయుడు నిఖిల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. వైసీపీ తరపున ఇక్కడ ఇప్పటికే కాసు వెంకట కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డి పోటీలో నిలుస్తున్నారు. చిలకలూరిపేట టిడిపి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పుల్లారావు భార్య ప్రకటించారు.
సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రానున్న రోజులలో టిడిపి తరఫున తనయుడు ఫణిని పోటీలో దించాలని ఆలోచన చేస్తున్నారు. గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా పోటీల్లో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున షౌకత్ కూతురు బరిలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రానున్న రోజులలో తన రెండవ కూతురైన దీప్తి టీడీపీ తరపున కీలక రాజకీయాల్లో తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రముఖుల వారసులు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారు. జిల్లాలో గత వందేళ్లు గా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనం కుటుంబంలో ఏసీ సుబ్బారెడ్డి నుంచి నేడు ఆనం రామనారాయణ రెడ్డి వరకు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు వారి పిల్లలు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు నల్లపురెడ్డి కుటుంబంలో కూడా వారి పిల్లలు రాజకీయాల్లోకి రానున్నారు. నెల్లూరు జిల్లాలో ఆనం, నల్లపురెడ్డి , నేదురుమల్లి కుటుంబాల్లో రాజకీయ వారసత్వం కొనసాగుతున్నాయి. అయితే మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వారసత్వ రాజకీయాలకు అవకాశం ఇవ్వలేదు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. జిల్లా రాజకీయాల్లో ఏసీ సుబ్బారెడ్డి, ఆనం భక్తవత్సల రెడ్డి ,ఆనం వెంకట రెడ్డి , ఆనం సంజీవరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఆనం జయ , ఆనం విజయలు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు రాజకీయాల్లోకి వస్తున్నారు.
ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో కూడా లేకపోయినప్పటికీ అవకాశం వస్తే నెల్లూరు లేదా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజారెడ్డి (మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు) కుమారుడు అభినవరెడ్డి రాజకీయాల్లోకి రానున్నారు.
2029 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కొవూరు నియోజకవర్గం నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడు నల్లపురెడ్డి రంజిత్ రాజకీయాల్లోకి రానున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,ఆయన సతీమణి సోమిరెడ్డి శృతి రెడ్డి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి .అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. వెంకటగిరి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ రాజకీయ లోకి రానున్నారు. 2024 లో చంద్ర బాబు నాయుడు ఆమెకు వెంకటగిరి టికెట్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆమె స్థానంలో తిరిగి రామకృష్ణనే చంద్రబాబు బరిలోకి దింపారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కుమారుడు బొల్లినేని కార్తిక్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని అంటున్నారు.
గిద్దలూరు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత మార్కాపురం వైసీపీ ఇంచార్జీ అన్నా రాంబాబు తనయుడు అన్నా కృష్ణచైతన్య చురుకుగా రాజకీయాల్లో తిరుగుతున్నారు. ప్రస్తుత మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తన కొడుకు కందుల విఘ్నేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో చురుకుగా తిరుగుతున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ స్థానంనుంచి టీడీపీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు రాఘవరెడ్డి 2029 పోటీ చేస్తారని శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. మార్కాపురం నుండి శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుండి పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు.
కడప జిల్లా రాయచోటి నుంచి సుగవాసి పాలకొండ్రాయుడు, సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీలో, సుగవాసి సుబ్రహ్మణ్యం వైసీపీ లో కొనసాగుతున్నారు. బద్వేల్ నుంచి బిజివేముల వీరారెడ్డి ఫ్యామిలీ.. ఇప్పటికి టీడీపీలోనే కొనసాగుతోంది. జమ్మలమడుగు నుంచి పొన్నపురెడ్డి శివారెడ్డి అలియాస్ బాంబుల శివారెడ్డి మొదటి నుంచి కొనసాగారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు రామసుబ్బారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా టీడీపీలో ఉన్నారు. కానీ, కొంతకాలం క్రితం రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇక రాయచోటి నుంచి గండికోట మోహన్ రెడ్డి, రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో కొనసాగుతోంది. రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీలో శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. గడికోట మోహన్ రెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. ఇక రాజంపేట లో కొండూరు మారారెడ్డి ఫ్యామిలీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రభావతమ్మ కొడుకు అజయ్ రెడ్డి వైసీపీలో కొనసాగుతున్నారు.. దేవగుడి ఫ్యామిలీ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నా మొదటి తరం నారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రెండవ తరం నుంచి భూపేష్ రెడ్డి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పలువురు నాయకులు తమ వారసులను రంగంలోకి దింపే ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం కుమారుడు గుమ్మనురు ఈశ్వర్ బరిలోకి దిగనున్నారు. ఉరవకొండ మంత్రి పయ్యావుల కేశవ్ కుమారులు విక్రమ్ సింహ, విజయ సింహలలో ఎవరో ఒకరు రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు కుమారుడు అమిలినేని యశ్వంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు. హిందూపురం ఎంపీ బి కే పార్థసారథి కుమారుడు బి కే సాయి కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కుమారుడు కాలువ భరత్ కూడా పోటీకి సై అంటున్నారు.గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి కుమార్తె నైరుతి రెడ్డి వైసీపీ తరపున బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడీ కుమారుడు ప్రణయ్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసే ఛాన్స్ ఉంది.
అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట రామి రెడ్డి అల్లుడు భీంరెడ్డి వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగనున్నారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ మెట్టు గోవింద రెడ్డి కుమారుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Follow Us