Local Body Elections : స్థానిక ఎన్నికలపై బిగ్ అప్డేట్.. అన్ని పార్టీలతో ఎన్నికల సంఘం కీలక మీటింగ్ !
తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఏకగ్రీవాలు లేకుండా ఎన్నికల నిర్వహణ, నోటా తదితర అంశాలపై పార్టీ నేతల నుంచి అభిప్రాయాలుసేకరించింది. ఈ సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.