/rtv/media/media_files/2025/02/12/EAUpTxPr4FJQNxhGRCmQ.webp)
Local Bodie Elections
తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఏకగ్రీవాలు లేకుండా ఎన్నికల నిర్వహణ, నోటా తదితర అంశాలపై వివిధ పార్టీల నేతల నుంచి అభిప్రాయాల సేకరణ చేపట్దింది.
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. నోటా ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం (ఈసీ) ఈ కీలక సమావేశం నిర్వహించింది. స్థానిక ఎన్నికల్లో నోటా తప్పనిసరిపై ఆయా రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం అధికారులు చర్చించారు. పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో నోటా పై అభిప్రాయం చెప్పాలని పార్టీలను ఈసీ కోరింది. దీనిపై అధికార కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కాగా ఓటర్ల తుది జాబితా ఖరారుపైనా కూడా ఈ సందర్శంగా చర్చ సాగింది.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. నోటాతో ఎన్నికలను నిర్వహించడాన్ని అధికార కాంగ్రెస్ వ్యతిరేకించింది. నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని వ్యతిరేకించింది. ఏకగ్రీవమైన చోట ఎన్నిక నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న పని అని అభిప్రాయపడింది. నోటాతో ఎన్నిక అనేది ఖర్చు ఎక్కువ అని అభిప్రాయపడింది. ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీ గెలిచినట్లుగా ప్రకటించాలని సూచించింది. కానీ బీఆర్ఎస్ మాత్రం సమర్థించింది. ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఏకగ్రీవ ఎన్నికల పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున తమ అభిప్రాయాన్ని ఇప్పుడే వెల్లడించలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఒకే అభ్యర్థి ఉన్నచోట కూడా నోటా ఉండాలని జనసేన అభిప్రాయపడింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ ఎలక్షన్ కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. ఎన్నిక కండక్ట్ చేయడం ముఖ్యమని.. నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనేది తర్వాత చర్చ అని తెలిపింది.
Also Read: మహిళల్లో రొమ్ము కాన్సర్‌కు వేరుసెనగలు బాగా పని చేస్తాయా?