Benami Shock For a Politician : రాజకీయనాయకుడికి బినామీ ఝలక్‌...వెయ్యికోట్లతో పరారీ...

నమ్మి నానబోస్తే...పుచ్చి పురుగులైందన్నట్లు...ఓ రాజకీయ నాయకుడిని తను నమ్ముకున్న బినామీనే నిలువెల్లా ముంచాడు. రాజకీయ నేతకు చెందిన వెయ్యికోట్లతో యూరప్‌ కు పరారయ్యాడు. ఆ నేతను పక్కనపెడుతూ చుక్కలు చూపెడుతున్నాడు. ఇది రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 

New Update
Benami Shock For a Politician

Benami Shock For a Politician

Benami Shock For a Politician : నమ్మి నానబోస్తే... పుచ్చి పురుగులైందన్నట్లు...ఓ రాజకీయ నాయకుడిని తను నమ్ముకున్న బినామీనే నిలువెల్లా ముంచాడు. రాజకీయ నేతకు చెందిన వెయ్యికోట్లతో యూరప్‌ కు పరారయ్యాడు. ఆ నేతను పక్కనపెడుతూ చుక్కలు చూపెడుతున్నాడు. ఈ విషయం రెండు రాష్ర్టా్ల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్

సాధారణంగా రాజకీయనాయకులు తాము సంపాదించిన సొమ్మును నిఘా వర్గాలకు, ఇన్‌కాంటాక్స్‌ అధికారులకు దొరకకుండా ఉండడం కోసం బినామీలను పెట్టుకుంటారు. తమ ఆస్తులన్నీ ఆ బినామీ పేరుమీదే ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా తనకో బినామీని పెట్టుకున్నాడు. నమ్మకంతో ఓ వెయ్యికోట్లను అతనితో దుబాయ్‌కి తరలించాడు. ఇప్పుడా బినామీ తరలించిన సొమ్ముతో యూరఫ్‌కు ఉడాయించాడు.

ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం తెలుగు రాష్ర్టాలకు చెందిన ఒక రాజకీయ నాయకులు కొంతకాలంగా తాము సంపాదించిన సంపదనంతా దుబాయ్‌కు తరలిస్తున్నారు. అక్కడ వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరు ఆస్తులు కొంటున్నారు. అలాగే ఓ రాజకీయ నాయకుడు కూడా ఏపీ, తెలంగాణ రాష్ర్టాలలో సంపాదించిన వెయ్యికోట్లను తనకు అత్యంత విశ్వసనీయుడైన బినామీ సహాయంతో దుబాయ్‌కు తరలించాడు. ఆయన ఇప్పుడే కాకుండా గతంలోనూ దుబాయ్‌కి పెద్ద మొత్తంలో డబ్బులు తరలించడంతో పాటు ఇతల లావాదేవీలను నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Tollywood Divorce: భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

అంతా సవ్యంగా సాగింది అనుకునేంతలో ఆ రాజకీయ నాయకుడికి సదరు బినామీ బిగ్‌ షాక్‌ ఇచ్చాడు. అక్కడికి వెళ్లిన తర్వాత రాజకీయ నాయకుడిని దూరం పెడుతూ వస్తున్నాడట. అప్పుడప్పుడు లైన్లోకి వచ్చినా ఏవేవో కారణాలు చెప్తూ తప్పించుకు తిరుగుతున్నాడట. అంతేకాదు తన మీద నమ్మకంతో ఇచ్చిన వెయ్యి కోట్లను గుట్టుచప్పుడు కాకుండా యూరప్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సదరు రాజకీయ నాయకుడికి హ్యాండ్‌ ఇచ్చి ప్రత్యర్థులతో చేతులు కలిపినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయం ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారింది. అంతేకాదు ఆ రాజకీయ నాయకుడు ఇలా మోస పోవడం గత ఏడాది కాలంలో ఇది రెండోసారి అని కూడా ప్రచారం సాగుతోంది.గతంలోనూ ఆయనకు ఇలాంటి ఝలకే ఇచ్చారట.  ఇదిలా ఉండగానే మరో ప్రచారం కూడా వినవిస్తోంది. సదరు విశ్వసనీయుడు ఎలాంటి మోసానికి పాల్పడలేదని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో  ఇబ్బందులు కొని తెచ్చుకోలేక అజ్ఞాతం లోకి వెళ్లినట్లు మరో వాదన వినపడుతుంది. అంతేకాదు ఆ రాజకీయ నాయకుడే స్వయంగా తన బినామీని కొంతకాలం వరకు బయటకు రాకుండా యూరప్‌కు పంపినట్లు కూడా ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి: Maoist: ఈ నేలపై నక్సలిజం చావదు.. ప్రభుత్వాలవి నీటిపై రాతలే: RTVతో పౌరహక్కుల నేత!
 
అయితే ఇంతకు ఆ రాజకీయ నాయకుడు ఎవరు? ఏపీకి చెందినవాడా? లేక తెలంగాణకు చెందినవాడా అనే చర్చమొదలైంది. అదే సమయంలో ఆ బినామీ ఎవరంటూ చర్చ సాగుతోంది. ఈ విషయం రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారడంతో రాజకీయనాయకులు తమ తమ బినామీల గురించి కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు