ఆంధ్రప్రదేశ్ Chandrababu: కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు AP: టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే ఎన్డీయే కూటమి తరఫున సభానాయకుడిగా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించారు. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: జనసేన శాసనసభపక్ష నేతగా పవన్ కళ్యాణ్ AP: తమ శాసనసభపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈరోజు మంగళగిరిలో జరిగిన సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరును జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి! AP: చంద్రబాబు కేబినెట్లో ఎవరు ఉండబోతున్నారనే దానిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. కాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మరోరెండు శాఖలను ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనిపై ఈరోజు స్పష్టత రానుంది. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : మా వర్గంలోకి రావొద్దు.. ముద్రగడకు షాక్ ఇచ్చిన రెడ్డి సామాజిక వర్గం! పిఠాపురం రెడ్డి సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభంకు భారీ షాక్ ఇచ్చింది. రెడ్లలో చేరుతానంటూ ముద్రగడ చేసిన ప్రకటనను వ్యతిరేకించింది. ఈ మేరకు కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. By srinivas 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తొలిమొక్కు.. ఎక్కడంటే? అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో పవన్ వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పూజలో టీడీపీ నేతలు సైతం పాల్గొన్నారు. By Jyoshna Sappogula 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పిఠాపురానికి పవన్ కల్యాణ్.. వర్మపై దాడి ఘటనపై సీరియస్? జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి పిఠాపురం వెళ్లనున్నారు. నియోజకవర్గానికి నేతలతో సమావేశం కానున్నారు. టీడీపీ - జనసేన నేతల మధ్య నెలకొన్న అసమ్మతి, టీడీపీ ఇన్‌ఛార్జి వర్మపై దాడి అంశాలను పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. By Nikhil 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే ఏపీలో రేపు ఉదయం 9.30 AM గంటలకు విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. శాసనసభాపక్ష నేతగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. ఇక జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: తనకు ఏ పదవి కావాలో చెప్పేసిన పవన్ కల్యాణ్..! డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఓ జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. పవన్ చెప్పిన విషయంపై ఆ ఛానల్లో కొంతసేపు స్క్రోలింగ్ ప్రసారం చేశారు. జనసేన అధినేత ఏపీలో డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నారని అందులో పేర్కొన్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ramoji Rao: రామోజీరావును ఇబ్బంది పెట్టారు: పవన్ కల్యాణ్ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పార్థివదేహానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. రామోజీని గత 15 ఏళ్లలో ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టాయని అన్నారు. ప్రమాణస్వీకారం తర్వాత కలద్దామనుకున్నానని అంతలోనే ఇలా జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. By B Aravind 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn