/rtv/media/media_files/2025/04/15/1OPwFqaN0GLEQvikg84y.jpg)
Pawan Kalyan Health Issues
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ సమావేశం కోసం హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. మంగళగిరిలోని నివాసంలో పవన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ ను లేకుండానే కేబినెట్ సమావేశం కొనసాగింది. ఫిబ్రవరిలో సైతం అనారోగ్యం కారణంగా పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. పవన్ తరచుగా అనారోగ్యానికి గురవుతుండడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan about His Health Problems
— M9 NEWS (@M9News_) March 14, 2025
"ఒకప్పుడు గ్రానైట్ రాళ్ళు గుండెల మీద పగల గొట్టించుకునే వాడిని... ఇప్పుడు నా రెండో కొడుకుని ఎత్తుకొలేనంత బలహీనం అయిపోయా"#JanaSena12thFormationDay pic.twitter.com/6h6IDnWKnl
ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ తన ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను గ్రానైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకుని పగల గొట్టించుకునేవాడినన్నారు. ఇద్దరు ముగ్గురు పిల్లలను భుజాల మీద ఎత్తుకుని నడిచే అంత బలం ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తన ఆరేళ్ల కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనం అయిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ అభిమానుల ఆశీర్వాదంతో ఆ బలాన్ని మళ్లీ తెచ్చుకుంటానన్నారు.
ఇటీవల కుమారుడి కోసం సింగపూర్ కు..
ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే.. అధికారులు అప్రమత్తమై కాపాడారు. కాళ్లు, చేతులకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే పవన్ సింగపూర్ వెళ్లారు. చికిత్సం కుమారుడిని హైదరాబాద్ తీసుకువచ్చారు. అనంతరం నేడు కేబినెట్ మీటింగ్ కోసం అమరావతి వచ్చారు పవన్ కల్యాణ్. అయితే వరుస ప్రయాణాల నేపథ్యంలోనే పవన్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.
(telugu-news | telugu breaking news )