ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన రఘు.. అలియాస్ పుష్పరాజ్‌ను అరెస్టు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. రఘు హీరో అల్లు అర్జున్ కు పెద్ద అభిమాని అని వెల్లడించారు. సోషల్ మీడియాలో హీరోల అభిమానుల పోరులో భాగంగానే రఘు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు.
మెగా కుటుంబంపై రఘు ద్వేషం
అల్లు అర్జున్‌కు మద్దతుగా మెగా కుటుంబంపై రఘు ద్వేషం పెంచుకున్నాడని తెలిపారు.గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. రఘు నుంచి ఐదు మొబైల్ లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 ఈ మెయిల్స్ వాడి ఎక్స్ ఖాతాలను తెరిచారని వెల్లడించారు. రఘు చేసిన పోస్టులన్నింటినీ పరిశీలించామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. అతని పోస్టులలో ఎక్కువగా మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. మహిళల గౌరవానికి భంగం కలిగించినందుకు , రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు గానూ రఘుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ మీడియాకు తెలిపారు.
మార్క్ శంకర్‌కు తీవ్ర గాయాలు
కాగా సింగపూర్‌లోని ఓ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిరు, పవన్ కుటుంబం అక్కడికి చేరుకుంది. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడింది. తన కుమారుడు క్షేమంగా పడటంతో మార్క్ శంకర్ తల్లి అన్నా.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించుకొన్నారు..
Also Read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!
పవన్ కల్యాణ్ కొడుకుపై కామెంట్స్ .. అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు.
allu-arjun fan arrest