Parliament: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!
కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై జేపీ నడ్డా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.