Parliament : ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుతున్నాయి.

New Update
Parliament

Parliament

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జూలై 21(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అందుకోసం ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుతున్నాయి. 21 రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా 7 పెండింగ్‌ బిల్లులతోపాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 

నేషనల్‌ స్పోర్ట్స్‌ గవర్నెన్స్‌ బిల్లు, జియోహెరిటేజ్‌ సైట్స్‌, జియో రెలిక్స్‌ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్‌ యాండీ డోపింగ్‌ (సవరణ) బిల్లు, మణిపూర్‌ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ఇన్‌కం ట్యాక్స్‌-2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాలలోనే పార్లమెంటు ముందుకు రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు