/rtv/media/media_files/2025/07/28/3-suspected-pahalgam-terrorists-killed-in-encounter-on-srinagar-outskirts-2025-07-28-15-14-19.jpg)
3 suspected Pahalgam terrorists killed in encounter on Srinagar outskirts
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుతో హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిన్న లోక్‌సభలో ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్‌షా ఈ విషయాన్ని సభ్యులకు వివరించారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు సులేమాన్, అఫ్గానీ, జిబ్రాన్ దాడి సమయంలో చివరిసారిగా ఎం-9, రెండు ఏకే 47 తుపాకులు ఉపయోగించారని వెల్లడించారు. ఈ దాడి తర్వాత మూడు నెలల పాటు వారు ఎవరికీ కనపడకుండా దాక్కున్నారు. అయితే పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు కీలక వ్యూహం పన్నాయి. దీంతో ఉగ్రవాదులు తమదేశమైన పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం రాలేదు.
ఇది కూడా చూడండి:Srishti Test Tube Baby Center: ఎంతకు తెగించార్రా.. బిడ్డను కొనుక్కొచ్చి నాటకం - ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్' కేసులో సంచలన నిజాలు..
Pahalgam Terror Attack
పహల్గాం దాడి అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఉన్నతాధికారులు కశ్మీర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగాఈ దాడిలో పాల్గొన్న ముష్కరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశమైన పాకిస్థాన్‌కు వెళ్లకుండా కట్టడి చేయాలని అమిత్‌షా భద్రతా బలగాలకు తేల్చి చెప్పారు. అందులో భాగంగా ఉగ్రవాదులు మనదేశంలోకి ప్రవేశించడానికి వినియోగించిన 8 కి.మీ మార్గాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. ఆ మార్గంలో సైన్యాన్ని మొహరించడంతో పాటు ఎవరు కూడా తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లకుండా కట్టడి చేయగలిగాయి. అదే సమయంలో వారు మనదేశానికి రావడానికి వినియోగించిన ఓ రహస్య టన్నెల్‌ను భద్రతా దళాలు గుర్తించాయి. ఆ సొరంగ మార్గాల్లో ఉగ్రవాదులు ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి వాటిని నీటి వరదలతో ముంచెత్తారు. దానితో ఆ సొరంగం నుంచి వారు ఎటు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అలా ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఏర్పడింది. దీంతో వారిని గుర్తించి కాల్చి చంపారు.
అయితే అపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ లో చర్చ సందర్భంగా కావాలనే కొంతమంది అమాయకులను పట్టుకొచ్చి కాల్చిచంపారని ఆరోపణలు వినవచ్చాయి. దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ
ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ‘ఆపరేషన్ మహాదేవ్’ను నిర్వహించామన్నారు. చనిపోయింది పహల్గాంలో దాడికి పాల్పడిన వారా? కాదా? అనే విషయాన్ని నిర్ధరించుకోవడానికి వారి వద్ద స్వాధీనం చేసుకున్న ఆయుధాల బుల్లెట్లను పహల్గాం దాడిలో లభ్యమైన తూటాలను సరిపోల్చామన్నారు.
ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన తర్వాత ముగ్గురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఒక ఎం-9, రెండు ఏకే-47 తుపాకులను సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో శ్రీనగర్ నుంచి చండీగఢ్ పంపాం. అక్కడి కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో వాటిని పరిశీలించాం. అవసరమైన పరీక్షలు చేయించాం. ఆ తుపాకుల నుంచి తూటాలు ప్రయోగాత్మకంగా నిపుణులు పేల్చి చూశారు. అలా వెలువడ్డ ఖాళీ తూటాలను పహల్గాం వద్ద లభ్యమైన ఖాళీ తూటాలతో పోల్చి చూశారు. ఈ సందర్భంగా రెండు ఒకే తూటాలుగా తేలింది. అ విషయాన్ని వారు నిర్ధారించారని అని అమిత్ షా పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: Srushti IVF Center: పోలీసులకు బిగ్ షాక్..ఏపీ కేసుకు తెలంగాణలో అరెస్టా? నమ్రత ఎదురుదాడి
parlament | amith shah comments | Pahalgam terror attack 2025 | latest-telugu-news | telugu-news | national news in Telugu