Musi River : జాతీయ నదీ పునర్జీవం పథకంలో మూసీ..ఎంపీ అనిల్ కుమార్ డిమాండ్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీనది పునర్జీవం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మూసీనది పునర్జీవం పథకాన్ని జాతీయ నదీ పునర్జీవం పథకంలో చేర్చాలని తెలంగాణ రాజ్యసభ సభ్యులు అనీల్‌కుమార్‌ యాదవ్‌ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.

New Update
Musi River

Musi River

 Musi River : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీనది పునర్జీవం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం నిధులు కూడా కేటాయించింది. అందులో భాగంగా మూసీ నది వెంట నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత కూడా చేపట్టింది. కాగా మూసీనది పునర్జీవం పథకాన్ని జాతీయ నదీ పునర్జీవం పథకంలో చేర్చాలని తెలంగాణ రాజ్యసభ సభ్యులు అనీల్‌కుమార్‌ యాదవ్‌ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.జీరో అవర్‌లో మాట్లాడిన అనీల్‌కుమార్‌ యాదవ్‌ పార్లమెంట్‌లో మాట్లాడేందుకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మూసీ విశిష్టతను, పునర్జీవం ఆవశ్యకతలను వివరించే ప్రయత్నం చేశారు.

Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

దేశంలోని ప్రధాన నదుల్లో  మూసీ నది ఒకటని, దీన్ని ముచ్‌కుందా పేరుతో పిలచేవారని తెలిపారు. మూసీ నది వికారాబాద్ అనంతగిరి కొండల్లో మొదలై హైదరాబాద్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ వద్ద కృష్ణా నదిలో కలుస్తుందని వివరించారు. మూసీ నదికి ఎంతో చరిత్ర ఉందని, హైదరాబాద్ మూసీ నది ఓడ్డున నిర్మించారని చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో మూసీ నది నీరు తాగేవారని, ఎన్నో ఎకరాలకు నీళ్లు అందించిందని చెప్పారు. అయితే నేడు మూసీ నది పరిస్థితి దారుణంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో చెత్త, ఇండస్ట్రీయల్ కెమికల్స్ ను మూసీ నదిలో వేస్తున్నారని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని వెల్లడించారు.పలు కంపెనీల కాలుష్య వ్యర్థాలు, సీవరేజ్‌ వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయని, దీని పరివాహక ప్రాంతాల్లో జీవనోపాధి దెబ్బతిన్నదని వివరించారు. మూసీనదికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, మూసీనది అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం తగిన నిధులిచ్చి సహకరించాలని డిమాండ్‌ చేశారు.మూసీనది పునర్జీవంతో నగరవాసులకు, రైతులకు, గంగపుత్రులకు జీవనోపాధి మెరుగవుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!

కానీ నిధులు కేటాయించాలని ఎన్ని సార్లు వినతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పారు. దీంతో అక్కడ డెవలప్ చేయడానికి కుదరడం లేదన్నారు. మూసీ నదిని డెవలప్ చేద్దామంటే.. బీజేపీ నేతలు నిరసనలు తెలియజేస్తారని వెల్లడించారు. ఎన్నికల సమయంలో బీజేపీ పెద్దలు హైదరాబాద్‌కి వచ్చి ప్రచారం చేస్తారని, కానీ ఒక్క నేత కూడా మూసీ నది పరిస్థితిపై మాట్లాడరని విమర్శించారు.

Also Read: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

 
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు