Coffee stalls: పార్లమెంట్‌లో అరకు కాఫీ.. రేపే రెండు స్టాల్స్‌ ప్రారంభం

అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ఆవరణలో సోమవారం నుంచి అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం కానున్నాయి. సభాపతి ఆదేశాలమేరకు రెండు కాఫీస్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని డైరెక్టర్ అరోరా ఉత్తర్వులు జారీచేశారు.

New Update
Araku Coffee in Parliament

Araku Coffee in Parliament

Coffee Stalls: అరకు కాఫీ కి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ఆవరణలో సోమవారం నుంచి అరకు కాఫీ స్టాల్స్  ప్రారంభం కానున్నాయి.  సభాపతి ఆదేశమేరకు రెండు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీచేశారు. సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోకసభ సచివాలయం అనుమతిచ్చింది.

ఇది కూడా చదవండి: KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్

 సోమవారం నుంచి ఈనెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కోసం గిరిజన కోఆపారేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. అలాగే రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్నారు.

ఇది కూడా చదవండి: Komatireddy-Balakrishna: బాలయ్య వేస్ట్.. ఆ విషయంలో నేనే బెస్ట్.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

పార్లమెంట్‌లో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్‌

సోమవారం నుండి పార్లమెంట్‌లో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తూర్పు కనుమల నుండి భారత దేశ పార్లమెంట్ వరకు అరకు వ్యాలీ కాఫీ ప్రస్థానం దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ రాష్ట్ర గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతుందని, వారి స్వహస్తాలతో పండించిన కాఫీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన భారత పార్లమెంట్‌లో ఎంపీలు అందరినీ అమోఘమైన రుచితో మైమరపించబోతుందన్నారు.

Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?

సోమవారం నుంచే పార్లమెంట్‌లో గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (GCC) ఆధ్వర్యంలో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ ప్రారంభం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ స్టాల్స్‌ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర కేంద్ర మంత్రులు.. ప్రారంభం చేయబోతున్నారని కలిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యా రాణి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని, ఏపీ కూటమి ఎంపీలు పాల్గొంటారు. అలాగే లోక్ సభ,రాజ్యసభ ఎంపీలందరూ అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ వద్దకు విచ్చేసి ఆర్గానిక్ కాఫీని రుచి చూడాలని కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.

Also Read: YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్‌...వారి మరణాల పై విచారణ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు