/rtv/media/media_files/2025/06/29/presidents-for-parliamentary-constituencies-2025-06-29-18-12-31.jpg)
presidents for parliamentary constituencies
PCC chief Mahesh Kumar Goud : కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు ఉంటారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకర్గాలున్నాయి.ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీలను నియమించారు. 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్ వైస్ ప్రెసిడెంట్‌ల పేర్లను మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఆదిలాబాద్ ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గానికి కే. రఘువీర్ రెడ్డిని నియమించారు.
Also Read: ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం.. తండ్రిపై కేసు నమోదు
Also Read : చార్‌ధామ్ భక్తులకు బిగ్ అలర్ట్.. మరోసారి యాత్ర వాయిదా!
ఇన్‌చార్జ్ లు వీరే...
కరీంనగర్‌కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జహీరాబాద్ బండి రమేష్, పెద్దపల్లి నియోజకవర్గానికి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మెదక్‌కు ఆలం ఖాన్, మల్కాజ్‌గిరికి ఎమ్మెల్సీ భసవరాజు సారయ్య, భోనగిరి కోమటిరెడ్డి వినయ్ రెడ్డి, వరంగల్ చిట్ల సత్యనారాయణ, మహబూబ్‌బాద్ పొట్ల నాగేశ్వర్ రావు, ఖమ్మం శ్రావణ్ కుమార్ రెడ్డి,చేవెళ్లకు బొంతు రామ్మోహన్, మహబూబ్‌నగర్‌కు ఎం.వేణు గౌడ్, సికింద్రాబాద్ హనుమండ్ల జాన్సీరెడ్డి, హైదరాబాద్‌కు చిన్నపాటల సంగమేశ్వర్, నాగర్ కర్నూల్ కొండేటి మల్లయ్య, నల్గొండ నమిడ్ల శ్రీనివాస్, భోనగిరి కోమటిరెడ్డి వినయ్ రెడ్డి, వరంగల్ చిట్ల సత్యనారాయణ, మహబూబ్‌బాద్ పొట్ల నాగేశ్వర్ రావు, ఖమ్మం శ్రావణ్ కుమార్ రెడ్డిని నియమించారు.
Also Read: మెడ, ఛాతిపై పదునైన పంటిగాట్లు.. కోల్‌కతా లా విద్యార్థిని మెడికల్ రిపోర్టులో షాకింగ్స్
Also Read : రాత్రి నిద్రలో పదే పదే నీరు తాగుతారా..? ఇది వ్యాధని తెలుసుకోండి..!!
incharge | vice-president | lok-sabha-constituencies | constituencies | parlament | TPCC Chief Mahesh Kumar Goud