Pakistan Army Pays Tribute To Terrorists | సిగ్గులేని పాక్ ఆర్మీ | India Pak War | Sindoor | RTV
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్‌తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు.
ప్రధాని మోదీ ఓ సభలో ఉగ్రవాదం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయం చేసేవాళ్లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. టెర్రరిస్టుల ఆచూకి చెప్తానంటూ వెళ్లిన అతడు నదిలో దూకాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.
పాకిస్థాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా జీలమ్ నదిపై ఉన్న ఈ కిషన్‌గంగా డ్యామ్ నుంచి నీటి విడుదలను ఆపాలని నిర్ణయించింది. ఇప్పటికే చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ డ్యామ్ గేట్లు భారత్ ముసివేసింది.