/rtv/media/media_files/2025/05/20/wjh0nLkciKJhnyC7Nauo.jpg)
youtuber Jyothi Malhotra past story
Jyothi Malhotra: పాకిస్థాన్ స్పై గా పనిచేసిన ఆరోపణలతో అరెస్ట్ అయిన ఇండియన్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా జ్యోతి చిన్నతనం, వ్యక్తిగతానికి సంబంధించి పలు సంచలన విషయాలు వెల్లడించారు.
ఏడాదికే వదిలేసిన తల్లి
జ్యోతి తండ్రి హరీష్ ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జ్యోతికి ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి అనాథాశ్రమంలో వదిలివేసి వెళ్ళిపోయిందని. దీంతో తాను, తాతా, మామలు కలిసి ఆమెను పెంచామని తెలిపారు. తల్లి లేకపోవడం వల్ల జ్యోతి పెంపకం ఒక సాధారణ బిడ్డలా ఉండేది కాదని వాపోయారు. అంతేకాదు జ్యోతి యూట్యూబ్ వీడియోలను తాను ఎప్పుడూ చూడలేదని.. తన దగ్గర ఒక సాధారణ మొబైల్ ఫోన్ ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ మొబైల్ ని పోలీసులు తీసుకెళ్లినట్లు చెప్పారు.
/rtv/media/media_files/2025/05/19/qwQE1dIC1KcfkCDzDp4n.jpg)
ఎక్కడికి వెళ్లినా చెప్పేది కాదు
జ్యోతి బయటకు వెళ్ళినప్పుడల్లా .. తాను ఎక్కడికి వెళ్తుందో కుటుంబ సభ్యులకు చెప్పేది కాదు. కేవలం ఎన్ని రోజులు వెళ్తుంది.. ఎప్పుడు తిరిగొస్తుంది? మాత్రమే చెప్పేదని తండ్రి హరీష్ తెలిపారు. ఆమె తల్లిదండ్రులతో కలిసి జీవించడానికి ఇష్టపడలేదని వాపోయారు.
/rtv/media/media_files/2025/05/19/1HJl1KNbtJrXQq4KcC9X.jpg)
ఫర్నిచర్ పెయింటర్ గా తండ్రి
అయితే జ్యోతి తండ్రి ఫర్నిచర్ పెయింటర్ గా పనిచేసేవారట. కానీ, ఆ వృత్తి నుంచి అతడికి పెద్దగా ఆదాయం ఉండేది కాదు. అయినప్పటికీ భార్య ఒత్తిడితో జవహర్ నగర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని జీవనం కొనసాగిస్తూ వచ్చాడు. ఇంతలో వారికి జ్యోతి పుట్టింది.
అయితే జ్యోతి పుట్టక ముందు నుంచే భార్యతో వివాదాలు జరుగుతూ ఉండేవట. దీంతో జ్యోతి పుట్టిన ఏడాదిన్నరకే ఆమెను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది తల్లి. ఆ తర్వాత సమాచారం అందుకున్న తండ్రి హరీష్ తన కూతురిని అనాథాశ్రమం నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి జ్యోతిని తండ్రి, తాతయ్య, మామయ్యలు కలిసి పెంచారు.
/rtv/media/media_files/2025/05/19/2MqNN5YHYQORaF0n4jXn.jpg)
కూతురి కోరిక మేరకు
పెయింటర్ గా పనిచేస్తున్న జ్యోతి తండ్రి హరీష్.. కొంతకాలం క్రితం కూతురి కోరిక మేరకు ఆ పని మానేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఇంటి ఖర్చుల కోసం జ్యోతి డబ్బులు పంపేదని. లేదంటే తమ్ముడి పెన్షన్ నుంచి ఖర్చులు తీర్చుకునేవాళ్లమని చెప్పారు. హరీష్ తమ్ముడు విద్యుత్ సంస్థలో ఫోర్‌మాన్ గా పనిచేశారు. కొంత కాలం క్రితం పదవి నుంచి రిటైర్ అయినట్లు సమాచారం.
పెళ్ళికి ఎప్పుడూ నిరాకరించేది..
తండ్రి హరీష్ ఇంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం జ్యోతికి 34 సంవత్సరాల వయసు ఉందని, ఆమెను ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా నిరాకరించేదని తెలిపారు. ఆమె ఎవరినైనా ఇష్టపడితే.. అతడి గురించి చెప్పమని కూడా తాను అడిగినట్లు చెప్పారు. కానీ.. జ్యోతి తాను ఏ అబ్బాయిని ఇష్టపడలేదని చెప్పిందట.
telugu-news | latest-news | 2025 india pakistan war | Pahalgam attack