Jyothi Malhotra: సరిగ్గా ఏడాదికి క్రితమే జ్యోతి మల్హోత్రాపై సామాన్యుడి కంప్లైంట్.. పట్టించుకోని NIA.. ట్వీట్ వైరల్!

పాకిస్థాన్‌కు స్పైగా పనిచేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రాపై ఏడాది క్రితమే ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా అనుమానం వ్యక్తం చేశాడు. 'కపిల్ జైన్' అనే ఎక్స్ యూజర్ జ్యోతి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని NIA ని హెచ్చరించాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

New Update
Jyothi Malhotra Pakistan spy

Jyothi Malhotra Pakistan spy

Jyothi Malhotra: భారత దేశానికి చెందిన  హర్యానా యూట్యూబర్   జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ కి స్పైగా పనిచేస్తూ పట్టుబడడం దేశవ్యాప్తంగా  చర్చనీయాంశమైంది. తన యూట్యూబ్ వీడియోలు, వ్లాగ్స్  ద్వారా భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌ నిఘా సంస్థలకు చేరవేస్తోందనే ఆరోపణలతో హిసార్ పోలీసులు ఆమెను  అరెస్ట్ చేశారు. 

ఏడాది క్రితమే నెటిజన్ పోస్ట్ 

అయితే  జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ కావడానికి సంవత్సరం ముందే.. ఆమె కదిలపై  ఓ భారతీయ  నెటిజన్  సోషల్ మీడియా వేదికగా అనుమానం వ్యక్తం చేశాడు. 2024 లో మే నెలలో  'కపిల్ జైన్'  అనే ఎక్స్ యూజర్   జ్యోతి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని NIA(నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ) ను  హెచ్చరించాడు.   కపిల్ తన పోస్ట్ లో ఇలా రాశారు..  “NIA, దయచేసి ఈ మహిళపై నిఘా ఉంచండి.. ఆమె మొదట పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి..  ఆ తర్వాత 10 రోజులు పాకిస్తాన్‌ను సందర్శించింది. ఇప్పుడు ఆమె మళ్ళీ  కాశ్మీర్‌కు వెళ్ళింది. వీటన్నిటి వెనుక ఏదో లింక్ ఉండవచ్చు” అంటూ  జైన్ జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ పేజీ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. 

జ్యోతి మల్హోత్రాకు "Travel with Jo" పేరుతో  యూట్యూబ్ లో ఛానెల్ ఉంది. దీనికి దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఈ క్రమంలోనే  కొంతకాలంగా జ్యోతి వీడియోలను, ఛానెల్ ని ఫాలో అవుతున్న ఎక్స్ యూజర్   'కపిల్' ఆమె కార్యకలాపాలను గమనించినట్లు తెలుస్తోంది. అందువల్లే ఏడాది క్రితమే అతడు జ్యోతి చర్యలపై NIA ను హెచ్చరించాడు. కానీ NIA అతడి సందేశాన్ని సీరియస్ గా  తీసుకోలేదని తెలుస్తుంది. 

 “జట్ రంధావా” పేరుతో కాంటాక్ట్స్ 

2023లో జ్యోతి  రెండు సార్లు పాకిస్తాన్‌కు  వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఆమె అలి ఎహ్వాన్, షాకిర్, రానా షాహబాజ్ అనే వ్యక్తులను కలిసినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా వారి ఫోన్ కాంటాక్ట్‌లను  “జట్ రంధావా” పేర్లతో సేవ్ చేసినట్లు తెలిసింది.  అంతేకాదు, ఆమె ఇండోనేసియా (బాలి) కూడా వెళ్లి..  అక్కడ ఒక ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌తో కలిసి ప్రయాణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

telugu-news | cinema-news | telugu-cinema-news | 2025 india pakistan war | Pahalgam attack | operation Sindoor

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు