/rtv/media/media_files/2025/05/19/Oq1mPpcHUYtJcqV3uizw.jpg)
Pakistani forces targeted Golden Temple after India's strikes against terrorists
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు భారత్ ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్.. భారత్‌పైకి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ భారత్‌పై దాడులు చేసేందుకు యత్నించినప్పుడు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి తెలిపారు. వాటిని భారత సైన్యం తిప్పికొట్టిందని పేర్కొన్నారు.
Also Read: రాయబారులతో రాసలీలలు.. హైదరాబాద్ లేడీ యూట్యూబర్స్‌తో జ్యోతికి సంబంధాలు!
'' మనం ఆపరేషన్ చేపట్టాక పాకిస్థాన్ దాడులకు తెగబడుతుందని ఇండియన్ ఆర్మీ అంచనా వేసింది. పాక్‌కు ఎలాంటి కచ్చితమాన టార్గెట్‌లు లేవు. అందుకే గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకునే ఛాన్స్ కనిపించింది. ముందుగానే ఊహించి ఈ టెంపుల్‌కు అదనపు రక్షణ కల్పించాం. దాడులను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధమయ్యాం. మన సైనిక ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్.. పాక్ దాడులను తిప్పికొట్టింది. గోల్డెన్ టెంపుల్‌పై ఒక్క గీత పడకుండా క్షిపణులు, డ్రోన్లను కూల్చిసేందని'' మేజర్ జనరల్ వివరించారు.
ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ పాక్, POKలోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు భారత సైన్యం వెల్లడించింది. ఆ తర్వాత భారత్‌పై పాక్ డ్రోన్లు, క్షిపణలతో దాడికి యత్నించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌ను ప్రయోగించింది. కానీ ఎస్ 400, ఆకాశ్ తదిత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు వాటిని నేలకూల్చాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: మాయలేడి జ్యోతి.. పాక్ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్‌లో విలాసం
ఇక ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లో పలువురు ఉగ్రవాదులు టూరిస్టులకు కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. దీంతో భారత్ పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్‌తో మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత చివరకి ఇరు దేశాల మధ్య కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. దీంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త చల్లారాయి.
Also Read: రైతులకు బిగ్ షాక్.. వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు
golden-temple | india-pakistan | punjab | operation Sindoor | Pahalgam attack