Pahalgam Attack: పహల్గామ్ అటాక్ లో చనిపోయిన మృతుల వివరాలు వెల్లడి..
కాశ్మీర్ లోని పహల్గామ్ లోని ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను ప్రకటించారు. మరో పది మంది క్షతగాత్రుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు.
కాశ్మీర్ లోని పహల్గామ్ లోని ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను ప్రకటించారు. మరో పది మంది క్షతగాత్రుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు.
పహల్గామ్లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం అడగడంతో పాటు మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు.
పహల్గాం ఉగ్రదాడి పై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు, తారక్,చరణ్, బన్నీ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
జమ్మూలోని పహల్గామ్ లో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఇంకా అక్కడే ఉన్నారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇందులో నలుగురిని గుర్తుపట్టినట్టు చెబుతున్నారు. టెర్రరిస్టుల్లో ఒకరి ఫోటో కూడా బయటకు వచ్చింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
జమ్మూలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఒక బైక్ ను గుర్తించారు. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు బలగాలు అనుమానిస్తున్నారు.