కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ వ్యాఖ్యలు..వారం రోజులకు అటాక్..మాకేం సంబంధం లేదంటున్న రక్షణ మంత్రి

కాశ్మీర్ పాక్ జీవనాడి...ఇది పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు. కరెక్ట్ గా వారం రోజుల తర్వాత ఇక్కడ అటాక్ జరిగింది.దీంతో దాడికి ఫాక్ ఆర్మీ వ్యాఖ్యలే ఊతమిచ్చాయని నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉగ్రవాదులు రెచ్చిపోవడానికి పాక్ కారణమంటున్నారు.

New Update
 Pakistan army chief Asim Munir

Pakistan army chief Asim Munir

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్‌ మునీర్‌ కాశ్మీర్ పై వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం విషయంలో తాము ముందు నుంచీ కూడా సరైన పద్ధతిలోనే వ్యవహరిస్తున్నామని చెప్పారు. అది పాక్ జీవనాడి...దానిని ఎప్పటికీ వదులుకోలేమని అన్నారు. అసిమ్‌ మునీర్‌ భారత్, కశ్మీర్‌ వివాదంపై కూడా మాట్లాడారు. పాకిస్థాన్‌ నుంచి కశ్మీర్‌ను ఏ శక్తి కూడా విడదీయలేదని చెప్పుకొచ్చారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారం అయిందో లేదో కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది. దాంతో ఇప్పుడు పాక్ ఆర్మీ ఛీఫ్ అన్నీ తెలిసే అలా మాట్లాడరా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ వ్యాఖ్యల వల్లనే ఉగ్రవాదులకు బలమొచ్చిందని...తిరిగి అవి శక్తిని పుంజుకోవడానికి దోహదం చేశాయని భారత నిఘా వర్గాలు అంటున్నాయి. ఈ సంస్థల ప్రాథమిక అంచనా ప్రకారం స్థానికుల మద్దతుతోనే ఆరుగురు ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడులకు పాల్పడ్డారని చెబుతున్నారు. దాడికి చాలా రోజుల ముందుగానే టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించారని...సమయం కోసం వేచి చూసి దాడి చేశారని చెబుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఉగ్రవాదులు కొన్ని హోటళ్లను సర్వే చేసినట్లు సూచనలు ఉన్నాయని తెలిపారు. 

మాకేం తెలియదు..మీదే పాపం..

ఇదెలా ఉంటే ఎవరూ ఏమీ అనకుండానే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భుజాలు తడుముకున్నారు. పహల్గామ్ లో ఉగ్రదాడికి తమ దేశానికి  ఏం సంబంధం లేదని అన్నారు. మేము ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వం అని అన్నారు. అక్కడితో ఆగకుండా భారతదేశమే అశాంతికి మద్దతిస్తోందని ఆరోపించారు. ఆసిఫ్ లైవ్ 92 న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ఆ దేశంలో డజన్ల కొద్దీ ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చారు. స్వదేశీ సంస్కృతి, హిందూత్వ శక్తులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. మైనారిటీలను అణచివేస్తున్నాయి. క్రైస్తవులు, బౌద్ధులను దోపిడీ చేస్తున్నాయి. వారిని చంపేస్తున్నారు.  వారే ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మారి దాడులుకు పాల్పడుతున్నారని ఆసిఫ్ వ్యాఖ్యలు చేశారు. 

today-latest-news-in-telugu | pakistan

Also Read: Pahalgam Attack: పహల్గామ్ అటాక్ లో చనిపోయిన మృతుల వివరాలు వెల్లడి..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు