ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గులు వీరే.. ఫొటోలు విడుదల చేసిన అధికారులు

జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మృతి చెందారు. క్రూరంగా మతం, పేర్లు అడిగి టూరిస్ట్‌లను చంపేసిన ఆ దుర్మార్గుల ఫొటోలను అధికారులు విడుదలు చేశారు. స్కెచ్‌లతో గీసిన ఆ టెర్రరిస్ట్‌ల ఫొటోలను రిలీజ్ చేశారు. 

New Update
Pahalgam Attack

జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మృతి చెందారు. అయితే ఈ ఉగ్రదాడి చేసింది తామేనని టీఆర్‌ఎఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే క్రూరంగా మతం, పేర్లు అడిగి చంపేసిన ఆ దుర్మార్గుల ఫొటోలను అధికారులు విడుదలు చేశారు. ఆ ఉగ్రదాడులు చేసిన వారి ఫొటోలను స్కెచ్‌లతో వేశారు. వాటినే అధికారులు రిలీజ్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

పేర్లు అడిగి మరి..

జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 28 మంది మృతి చెందారు. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొందరు అబద్ధం చెబుతారు ఏమోనని మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు. మరికొందరి ఐడీ కార్డులు చెక్ చేసి హతమార్చారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్‌కి వెళ్లిన వారు ఈ ఉగ్రదాడికి బలి అయ్యారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు