/rtv/media/media_files/2025/01/05/QURW6q4Q4upjzdOdD3fa.jpg)
Gautam Gambhir comments on Sydney Test defeat
పహల్గంలో ఉగ్రవాదులు జరిపిన దాడులను భారత మాజీ , ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు.ఇలాంటి సమయంలోనే దేశ పౌరులంతా కూడా ఐక్యంగా కలిసి ఉండాలని..బాధ్యులు తప్పుకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. కశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులను చుట్టుముట్టి..అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ఘటన గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యా పర్యటకుల పై దాడి అత్యంత దారుణం.బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఇలాంటప్పుడే మనమంతా ఐక్యంగా ఉండి,మానవత్వం ప్రదర్శించాలని యువరాజ్ సింగ్ అన్నారు.
ప్రతిసారీ అమాయకులే జీవితాలను కోల్పోతున్నారు. కశ్మీర్ లో చోటు చేసుకున్న ఘటన హృదయవిదారకంగా ఉంది. కొన్ని రోజుల కిందటే అక్కడ ఉన్నా ఈ బాధ మరింత ఎక్కువగా ఉందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పారు.
పహల్గం దాడి ఘటన తీవ్రంగా బాధించింది. అమాయకమైన పర్యటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు అండగా నిలుద్దాం.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దామని సెహ్వాగ్ రాసుకొచ్చారు.
ఉగ్రదాడి వార్త వినగానే నా హృదయం విరిగిపోయింది.బాధిత కుటుంబ సభ్యుల గురించే నా ఆలోచన.శాంతి చేకూరాలని ఆశిస్తున్నా.దేశంలో హింసకు తావులేదని రాహుల్, గిల్ చెప్పుకొచ్చారు.
బాధిత కుటుంబాల కోసం మనమంతా అండగా నిలుద్దాం. ఎవరైతే ఈ దురాఘాతానికి బాధ్యులో వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు.తప్పకుండా భారత్ స్ట్రైక్ అవుతుంనది గంభీర్ అన్నారు.
Also Read: pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్ జంట!
Also Read: J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!
cricket | Pahalgam attack | pahalgam attack live | latest-news | gambhir