Maoists Killed: కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 26 మంది మావోయిస్టులు మృతి
బుధవారం ఉదయం తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
బుధవారం ఉదయం తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల హక్కులను కాలరాయొద్దని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు తదితరులు భేటీ అయ్యారు.
ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైన కర్రెగుట్ట ను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏడు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. ఈ గుట్టల్లో సుమారు 1000మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం ఉండడంతో గాలింపు ముమ్మరం చేశాయి.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే ఆపివేయాలని ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. దేశంలో అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు.