Minister Seethakka :  ఆపరేషన్ కగార్‌ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసుల హక్కులను కాలరాయొద్దని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు తదితరులు భేటీ అయ్యారు.

New Update
Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసుల హక్కులను కాలరాయొద్దని మంత్రి సీతక్క  కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు తదితరులు భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని ప్రతినిధులు మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రిగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి తెలిపారు. ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ప్రతినిధులు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

ఇందుకు మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆ జాతి బిడ్డగా ఆది వాసులకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఆపరేషన్ కగార్‌తో ఆదివాసీలు తీవ్రభయాందోళనతో ఉన్నారని, ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయని, అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఆదివాసీల ప్రయోజనాలు దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలన్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి అన్నారు. మధ్య భారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి.. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయి.. ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి.. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి అని సీతక్క పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు