Operation Sindoor: నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది.. ప్రధాని మోదీ ఎమోషనల్

ప్రధాని గుజరాత్‌‌ బహిరంగ సభలో పాకిస్తాన్, ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి సమాధానమే ఉంటుందని హెచ్చరించారు. భారతీయ మహిళ సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామన్నారు.

New Update
Modi in gujarath

ప్రధాని మోదీ గుజరాత్‌ బికనీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆగ్రహానికి లోనైయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని పాకిస్తాన్, ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. టెర్రరిస్టులపై ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ.. నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి సమాధానమే ఉంటుందని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ పై ప్రధాని స్పందించారు. మన ఆడబిడ్డల సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేసినట్లు ప్రధాని తెలిపారు. సిందూరం భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరూ చూశారు. మన బలగాలు 22 నిమిషాల్లోనే టెర్రరిస్టులకు బదులిచ్చాయని తెలిపారు. పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని మోదీ చెప్పారు. భారత ప్రజల జోలికొస్తే గట్టి గుణపాఠం తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు.

ఆపరేషన్‌ సిందూర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్వపడుతున్నారని అన్నారు. వ్యూహాలతో త్రివిధ దళాలు ప్రత్యర్థి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయన్నారు. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల 9 స్థావరాలను 22 నిమిషాల్లోనే ధ్వంసం చేశాం. భారతీయ మహిళల సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశాయి. మన సాయుధ దళాలు పాక్‌ను మోకరిల్లేలా చేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాక్‌ అణుబాంబు వేస్తామని బెదిరిస్తే భారత్‌ ఇక ఏమాత్రం భయపడదని మోదీ అన్నారు. 

pm-modi | terrorists | gujarat | latest-telugu-news | operation sindoor india | operation sindoor latest

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు