Oman: ఒమాన్‌లో భారీ కాల్పులు.. ఆరుగురు మృతుల్లో భారతీయుడు
ఒమాన్ రాజధాని మస్కట్‌లో సోమవారం షియా మసీదు సమీపంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరణించిన వారిలో భారత్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని ఒమాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది.