/rtv/media/media_files/2025/09/19/ind-2025-09-19-19-59-06.jpg)
ఆసియా కప్ 2025(Asia cup 2025) లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ మొదలైంది. పసికూన ఒమన్(Oman) తో టీమిండియా(Team India) మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియా, ఒమన్ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే టీమిండియా సూపర్-4కు అర్హత సాధించింది. ఒకవేళ ఒమన్ గెలిచినా ఇంటిదారి పట్టక తప్పదు. ఈ మ్యాచ్ ఒమన్ జట్టుకు కేవలం లాంఛనం మాత్రమే. ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి స్థానంలో హర్షిత్ రాణాను మరియు జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కింది. ఒమన్ కూడా తమ జట్టులో రెండు మార్పులు చేసింది.
Also Read : హార్ట్ బ్రేకింగ్.. మ్యాచ్ ఆడుతుండగానే మరణవార్త
🚨 Asia Cup 2025 LIVE Streaming 🚨
— Vishwas Goswami (@ViswasGoswami) September 19, 2025
Watch India vs Oman live and free! ⚡
Join the Telegram link below for uninterrupted streaming! 🎥📲
🔗 https://t.co/ivJsi00RBl#IndvsOmn#INDvsOMAN#INDvOMANpic.twitter.com/YUSWnc7c5z
Also Read : పాకిస్తాన్ క్రికెట్‌లో న్యూ స్కామ్.. అవినీతి ఉందంటూ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు!
జట్లు:
ఒమన్ (ప్లేయింగ్ XI):అమీర్ కలీమ్, జతీందర్ సింగ్(సి), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా(w), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్త్, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితేన్ రామానంది
భారత్ (ప్లేయింగ్ XI):అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్